Day June 1, 2026

అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం

-ఉద్యమ నాయకులు పందుల సైదులు – అమరుల త్యాగాల‌ను స్మ‌రిస్తూ  స్మృతి దీపం న‌ల్గొండ‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 1: అమరుల త్యాగాల ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అని, వారి త్యాగాలను నిరంతరం కొనియాడాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందని తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం…

పవన్‌ ‌కళ్యాణ్‌కు పోలీసుల షాక్‌

-‌ నవనిర్మాణ సభకు అనుమతి నిరాకరణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 1: ‌జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ ‌కళ్యాణ్‌ ‌కు తెలంగాణ పోలీసులు భారీ షాక్‌ ఇచ్చారు. హైదరాబాద్‌లో మంగళవారం తలపెట్టిన జనసేన నవనిర్మాణ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, శాంతిభద్రతల దృష్ట్యా జనసేన సభకు అనుమతి ఇవ్వలేమని…

‘టెట్‌’ షెడ్యూల్‌ ‌విడుదల

– 16 ‌నుంచి 22 ‌వరకు  పరీక్షలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌1: ‌తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష -2026 షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్‌ 16 ‌నుంచి జూన్‌ 22 ‌వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం షిప్ట్ 9 ‌గంటల నుంచి 11:30 గంటల…

పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌పై అసత్య ప్రచారాలు

– ఇది ఎప్పుడూ ఉండేదే అన్న చైర్మన్‌ ‌బుర్రా – ఈ నెలలో 5 నుంచి 6 నోటిఫికేషన్లు విడుదల చేస్తాం – ప్రస్తుతం 3,800 పోస్టుల భర్తీకి అనుమతులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌1: ‌నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌  ‌చైర్మన్‌ ‌బుర్ర వెంకటేశం శుభవార్త చెప్పారు. ఉద్యోగాల భర్తీ ప్ర‌క్రియలో వేగం పెంచడంతోపాటు, ఎలాంటి అవకతవకలకు…

ప్రజావాణి కాదు.. ఫోన్‌వాణి!

– ప్రజలు వెయిటింగ్.. అధికారులు చాటింగ్ సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర జూన్ 1: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్  అర్జీదారులతో పలు సమస్యలపై మాట్లాడుతున్నప్పటికీ.. కొందరు అధికారుల వ్యవహారశైలి విమర్శలకు దారితీసింది. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి…

రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్ర‌త్యేక చిత్రం

– ఆవిష్క‌రించిన ప్ర‌ఖ్యాత చిత్ర‌కారుడు రుస్తుం సిద్దిపేట, ప్రజాతంత్ర జూన్ 1: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో ప్రఖ్యాత అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం రూపొందించిన “తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం” ప్రత్యేక చిత్రాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రుస్తుం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సకల జనుల ఆకాంక్షలకు,…

తెలంగాణలో బీజేపీకి అధికారం కల్ల

– మతం పేరుతో రాజకీయాలు తగదు – సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌1: ‌మతపరమైన విభజన పైన.. మతం అనే సౌధంపైన బీజేపీ నిలబడి ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ముగ్దూం భవన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్‌ ‌సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. బీజేపీ తెలంగాణాలో…

నిర్లక్ష్యం.. పసికందు భవిష్యత్తును అంధకారం

– శిశువు ఎడమ చేయి తొలగింపు – కలెక్టర్‌కు మొరపెట్టుకున్న తల్లిదండ్రులు – ఖమ్మం ప్రభుత్వ ద‌వాఖాన‌లో హృద‌య‌విదార‌క‌ ఘ‌ట‌న‌ ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్ 1 :  నెలలు తక్కువగా పుట్టాడని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ద‌వాఖానకు వొస్తే.. అక్కడ సిబ్బంది చూపిన తీవ్ర నిర్లక్ష్యం ఒక పసికందును జీవితాంతం దివ్యాంగుడిగా మార్చింది. చేతికి…

తెలంగాణ మాకు కీలకమైన రాష్ట్రం

– అధిష్ఠానం ప్రత్యేక దృష్టి పెట్టింది – ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులకు రాష్ట్రమే కారణం – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు దిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 1 : దక్షిణాదిలోనూ ఎన్డీయే ప్రభావం పెరుగుతోందని, రాబోయే రోజుల్లో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కార్యక్రమాలను జాతీయ అధ్యక్షుడు…