‘టెట్‌’ షెడ్యూల్‌ ‌విడుదల

– 16 ‌నుంచి 22 ‌వరకు  పరీక్షలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌1: ‌తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష -2026 షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్‌ 16 ‌నుంచి జూన్‌ 22 ‌వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం షిప్ట్ 9 ‌గంటల నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం షిప్ట్ 2 ‌గంటల నుంచి 4:30 గంటల వరకు ఉంటుంది. పరీక్షలను పూర్తిగా ఆన్‌లైన్‌ ‌విధానంలో నిర్వహించనున్నారు.  పేపర్‌-1, ‌పేపర్‌-2 ‌పరీక్షల తేదీలతో పాటు ఉత్తీర్ణత ప్రమాణాలను కూడా అధికారులు వెల్లడించారు. దీంతో పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ ప్రణాళికలను మరింత మెరుగ్గా రూపొందించుకునే అవకాశం లభించింది. టీఎస్‌ ‌టెట్‌ ‌పరీక్ష మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్‌ ‌కేటగిరీ అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులు సాధించాలి.బీసీ అభ్యర్థులు 50 శాతం మార్కులు పొందాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధిస్తే అర్హత పొందుతారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *