పవన్‌ ‌కళ్యాణ్‌కు పోలీసుల షాక్‌

-‌ నవనిర్మాణ సభకు అనుమతి నిరాకరణ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 1: ‌జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ ‌కళ్యాణ్‌ ‌కు తెలంగాణ పోలీసులు భారీ షాక్‌ ఇచ్చారు. హైదరాబాద్‌లో మంగళవారం తలపెట్టిన జనసేన నవనిర్మాణ సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, శాంతిభద్రతల దృష్ట్యా జనసేన సభకు అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జ‌న‌సేన నేత‌లు కోర్టును ఆశ్రయించారు . నవనిర్మాణ సభకు కోర్టులో అనుమతి లభిస్తుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. జనసేన నేత మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాము సభ పెట్టట్లేదని, సమావేశం నిర్వహించుకుంటున్నామని చెప్పారు. కన్వెన్షన్‌ ‌సెంటర్లలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంపై పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది.. అనుమతి ఎందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. సరైన కారణాలు చెప్పకుండా పోలీసులు అనుమతి నిరాకరించారని, సమావేశం అనుమతి కోసం కోర్టును ఆశ్రయించామని చెప్పారు. అయితే.. జనసేన సభను అటు అధికార కాంగ్రెస్‌, ‌విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనసేన సభను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ‌పవన్‌ ‌కళ్యాణ్‌ ‌తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే ఇక్కడ నవ నిర్మాణ సభ పెట్టుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. అనువణువునా తెలంగాణపై వ్యతిరేకతను నింపుకున్న పవన్‌… ఇప్పు‌డు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా బీజేపీ ఎజెండాను మోస్తున్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. క‌విత పవన్‌ ‌కళ్యాణ్‌ ‌కు స్ట్రాంగ్‌ ‌వార్నింగ్‌ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *