పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌పై అసత్య ప్రచారాలు

– ఇది ఎప్పుడూ ఉండేదే అన్న చైర్మన్‌ ‌బుర్రా
– ఈ నెలలో 5 నుంచి 6 నోటిఫికేషన్లు విడుదల చేస్తాం
– ప్రస్తుతం 3,800 పోస్టుల భర్తీకి అనుమతులు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌1: ‌నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌  ‌చైర్మన్‌ ‌బుర్ర వెంకటేశం శుభవార్త చెప్పారు. ఉద్యోగాల భర్తీ ప్ర‌క్రియలో వేగం పెంచడంతోపాటు, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా సరికొత్త మార్పులు తీసుకువస్తున్నట్లు  ప్రకటించారు. నిరుద్యోగుల్లో నమ్మకం కలిగించేలా పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు.తమది చాలా క్లిష్టమైన ఉద్యోగమని, అందరినీ మెప్పించడం సాధ్యం కాదని   అన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదని, టీజీపీఎస్సీపై అసత్యాలు ప్రచారం చేసేవారు ఎప్పుడూ ఉంటారని అన్నారు. ఈ నెలలో 5 నుంచి 6 నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి ప్రస్తుతం 3,800 ఉద్యోగ పోస్టుల భర్తీకి అనుమతులు వచ్చాయని చైర్మన్‌ ‌తెలిపారు. అటవీ శాఖలో 3,093 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. సింగిల్‌ ‌పోస్ట్ ‌ఖాలీలు 25 ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీ కోసం ఇకపై క్రమంతప్పకుండా రెగ్యులర్‌ ‌గా నోటిఫికేషన్లు విడుదల చేస్తామన్నారు. ఇందులో భాగంగా ప్రతి నెల సగటున మూడు నోటిఫికేషన్లు ఇస్తామని, రేపే మూడు కొత్త నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఉద్యోగ నియామక పక్రియ ఏది ప్రారంభించినా, దానిని గరిష్టంగా ఒక ఏడాది లోపే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అలాగే.. ఇకపై నిర్వహించే నియామక పరీక్షలన్నీ పూర్తిగా కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ ‌మోడ్‌ ‌లోనే జరుగుతాయని తెలిపారు. దీనివల్ల పేపర్‌ ‌లీకేజీలకు అవకాశం ఉండదని, పరీక్ష పేపర్‌ను ముందే తయారు చేయడం అనేది ఇకపై ఉండదని చెప్పారు. వీలైతే అభ్యర్థులు పరీక్ష రాసిన వెంటనే ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశారో కూడా తెలిసిపోయేలా సాంకేతికతను తీసుకువస్తున్నట్లు హింట్‌ ఇచ్చారు. ఉద్యోగ నియామకాల్లో మొదట నోటిఫికేషన్‌, ‌తర్వాత పరీక్ష, ఆపై మెరిట్‌ ‌లిస్ట్, ‌చివరిగా సెలక్షన్‌ ‌లిస్ట్ అనే పారదర్శక విధానాన్ని ఖచ్చితంగా పాటిస్తామన్నారు. పరీక్షల్లో ఎలాంటి లోపాలు లేవనే నమ్మకాన్ని అభ్యర్థుల్లో కలిగించడానికే తామంతా పనిచేస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో ఆయన ఒక ప్రాధాన్యత గల విషయాన్ని గుర్తుచేశారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని, కేవలం 0.1 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. ఉద్యోగం రాని మిగతా వాళ్ళు కమిషన్‌పై దుష్పచ్రారం చేయడం సహజమేనని, అయితే అభ్యర్థులు అలాంటి వదంతులను నమ్మవద్దని ఆయన కోరారు. మొత్తానికి తీసుకొస్తున్న ఈ మార్పులు నిరుద్యోగుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. ఇకపోతే మీడియాతో మాట్లాడకపోవడం కంటే మాట్లాడటమే మంచిదని భావిస్తున్నాం. అందుకే, ఇకపై 2, 3 నెలలకోసారి మీడియా సమావేశాలు నిర్వహిస్తాం. పరీక్షల విషయానికొస్తే కంప్యూటర్‌ ‌బేస్డ్ ‌పరీక్షల నిర్వహణ‌ ఉత్తమమైంది. ఈ విధానంలో పరీక్షకు గంట ముందు కూడా ప్రశ్నాపత్రం రూపొందించవచ్చు. ఓఎంఆర్‌ ‌పద్ధతిలో పరీక్ష నిర్వహణ చాలా క్లిష్టమైంది. పరీక్షల నిర్వహణలో అనేక సంస్కరణలు తెస్తున్నాం. టీజీపీఎస్సీ పరీక్షలన్నీ కంప్యూటర్‌ ‌బేస్డ్ ‌విధానంలో నిర్వహించే దిశగా వెళ్తున్నాం. ప్రతి నెలా 2, 3 నోటిఫికేషన్లు ఇస్తాం. ప్రస్తుతం 28 రకాల పోస్టులకు ఒక్కో ఖాళీ ఉంది. ఇంకో 25 రకాల పోస్టుల్లో 5 కంటే తక్కువ ఖాళీలు ఉన్నాయి. జూన్‌ 2‌న మూడు నోటిఫికేషన్లు విడుదల చేస్తాం. 3,800 పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చింది. 1,393 ఫారెస్ట్ ‌బీట్‌ ఆఫీసర్‌ ‌పోస్టులు ఉన్నాయని బుర్రా వెంకటేశం తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *