ప్రజావాణి కాదు.. ఫోన్‌వాణి!

– ప్రజలు వెయిటింగ్.. అధికారులు చాటింగ్

సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర జూన్ 1: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్  అర్జీదారులతో పలు సమస్యలపై మాట్లాడుతున్నప్పటికీ.. కొందరు అధికారుల వ్యవహారశైలి విమర్శలకు దారితీసింది. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో అర్జీదారులు హాజరయ్యారు. ఒక‌ప‌క్క‌ తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు గంటల తరబడి ప్ర‌జ‌లు వేచి వుంటే, మ‌రోప‌క్క కొందరు అధికారులు మాత్రం మొబైల్ ఫోన్లలో నిమగ్నమై ఉండటం విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. ప్రజల వినతులను శ్రద్ధగా ఆలకించి తక్షణ చర్యలకు ఆదేశాలు ఇవ్వాల్సిన సమయంలో కొందరు అధికారులు ఫోన్లలో కాలక్షేపం చేయడం కనిపించిందని అర్జీదారులు ఆరోపించారు.

ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా ఉండాల్సిన ప్రజావాణి కార్యక్రమంలో ఇలాంటి నిర్లక్ష్య వైఖరి సరైనది కాదని వారు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా ప్రజావాణి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, కొందరు అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల కార్యక్రమం ఉద్దేశం దెబ్బతింటోందని పలువురు పేర్కొన్నారు. ప్రజల పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజావాణి కార్యక్రమంలో అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని అర్జీదారులు కోరుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *