రాష్ట్ర అవతరణ దినోత్సవ ప్ర‌త్యేక చిత్రం

– ఆవిష్క‌రించిన ప్ర‌ఖ్యాత చిత్ర‌కారుడు రుస్తుం

సిద్దిపేట, ప్రజాతంత్ర జూన్ 1: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో ప్రఖ్యాత అంతర్జాతీయ చిత్రకారుడు రుస్తుం రూపొందించిన “తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం” ప్రత్యేక చిత్రాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రుస్తుం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సకల జనుల ఆకాంక్షలకు, అమరవీరుల త్యాగాలకు ప్రతీకగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రైతుబంధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్టు, మత్స్య పరిశ్రమ అభివృద్ధి, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ఈ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.అయితే రాష్ట్రంలో ఇంకా నిరుద్యోగం, పరిశ్రమల కొరత, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి సమస్యలు పరిష్కారం కావాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ సమస్యల పరిష్కార దిశగా మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. మత సామరస్యాన్ని పరిరక్షిస్తూ, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే కాకుండా ప్రపంచానికి సైతం ఆదర్శంగా నిలవాలని, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆర్‌ఏఎఫ్ అధ్యక్షురాలు జులేఖా రుస్తుం, నైరూప్య చిత్రకారుడు నహీం రుస్తుం, సీనియర్ అసిస్టెంట్ రజియా, నేచర్ ఆర్టిస్ట్ రూబీనా రుస్తుం, సాధిక్ మహ్మద్ రహీం ఎండి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *