Day May 11, 2026

అబ్‌కీ బార్‌ ‌బిజెపి సర్కార్‌..?

  “మూడవసారి దేశ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆదివారం తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన నరేంద్రమోదీ తన ప్రసంగంలో ఈ నినాదమివ్వడంతో రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో ఇక్కడ బిజెపి సర్కార్‌ ‌పక్కా అన్న ప్రచారం జరుగుతున్నది. దీంతోపాటు రాష్ట్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్‌, అం‌తే బలంగాఉన్న ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ను  వచ్చే ఎన్నికల్లో బిజెపి…

ఔషధ రవాణాలో రైల్వే కీలక ముందడుగు

– ‘ఔషధి ఎక్స్‌ప్రెస్’ ప్రారంభంపై మంత్రి కిషన్‌రెడ్డి హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : ప్రయాణికుల సేవలు, వస్తు రవాణాతోపాటు అత్యాధునిక సేవలు కల్పించడంలో నూతన సాంకేతికతలు, ఆవిష్కరణలతో దూసుకుపోతున్న భారతీయ రైల్వే ఇప్పుడు ఔషధాల రవాణాపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పీఎం గతిశక్తి కార్యక్రమానికి కొనసాగింపుగా ఫార్మా…

పూర్తిస్థాయి సేవలందించేలా తీర్చిదిద్దాలి

– సనత్‌నగర్ ‘టిమ్స్‌’లో ట్రయల్ రన్‌పై మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలందించేలా సనత్‌నగర్ ‘టిమ్స్‌’ను తీర్చిదిద్దాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఇందులో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్‌పై మంత్రి సెక్రటేరియట్‌లో సోమవారం సోమవారం సమీక్షించారు.…

మహిళల జీవనోపాధుల బలోపేతానికి మరో అడుగు

–  సెర్ప్, పీవీఎన్‌ఆర్‌టీయూ మధ్య ఎంవోయూ – ఆదాయ వనరులు పెంచడమే లక్ష్యం : మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత, పశుసంవర్ధక ఆధారిత జీవనోపాధుల విస్తరణకు మరో కీలక అడుగు పడింది. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్), పి.వి.నరసింహారావు తెలంగాణ వెటర్నరీ…

ఉద్యోగాలకు ఎంపికైన నర్సులకు రేపు నియామ‌క‌పు ప‌త్రాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన నర్సులకు మంగళవారం ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ అందజేయనున్నారు. కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ అందుకోబోతున్న నర్సులకు ఇబ్బంది…

తుది దశలోకి కొహెడ మార్కెట్ నిర్మాణ పనులు

– డిసెంబర్ 9 నుంచి సేవలు అందుబాటులోకి – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ వ్యవస్థను ఆధునికీకరించేందుకు కీలకంగా భావిస్తున్న కొహెడ సమగ్ర మార్కెట్ నిర్మాణ పనులు తుది దశలోకి చేరుకున్నాయని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

రాష్ట్రంలో రాజకీయ మార్పు అనివార్యం

– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : ఎన్నికలు లేని సమయంలో కూడా ప్రధాని మోదీ సభకు ఇంతటి జనసంద్రం కనిపించడం రాష్ట్రంలో బీజేపీపై పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. సోమ‌వారం మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ సభ విజయవంతమయ్యేందుకు కార్యకర్తల అహర్నిశల శ్రమ, నాయకత్వ…

పోక్సో కేసుపై తక్షణమే విచారణ మొదలుపెట్టాలి

– డీజీపీకి సీఎం ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్ అనే వ్యక్తిపై నమోదు చేసిన కేసుపై తక్షణమే విచారణ మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కేసు…

16న జాబ్-మేలా

~ 15 సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: అక్షర ఎంటర్‌ప్రైజెస్, బెంగళూరు ఆధ్వ‌ర్యంలో ఈ నెల 16న జాబ్ మేలా నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్ మెంట్ బ్యూరో తెలిపింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న బ్యూరో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జాబ్…