పోక్సో కేసుపై తక్షణమే విచారణ మొదలుపెట్టాలి

– డీజీపీకి సీఎం ఆదేశం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బండి భగీరథ్ అనే వ్యక్తిపై నమోదు చేసిన కేసుపై తక్షణమే విచారణ మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్‌ను ఆదేశించారు. 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. కేసు వివరాలను డీజీపీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని సమాధానమిచ్చారు. కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

కేసు విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు

బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (టీఎస్‌సీపీసీఆర్) చైర్‌పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి స్పందించారు. నగర పోలీస్ కమిషనర్ నుంచి వివరాలు తెప్పించుకుని విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *