– సీజేపీకి దిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూదిల్లీ, సెప్టెంబర్ 25 : ఒక మహిళతో ప్రధాని మోదీ ఉన్న ఏఐ మార్పుడ్ ఫొటోను సీజేపీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఈ పోస్టును తొలగించాల్సిందిగా మెటా సంస్థను ఆదేశించింది. అలాగే, సీజేపీ సహా ఆ సంస్థ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, కీలక నేతలు అశుతోష్ రాంకా, రత్నా సింగ్ లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీ ఒక మహిళతో ఉన్నట్లు మార్ఫింగ్ చేసిన ఫొటోను ఇటీవల సీజేపీ నేతలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. దీంతో ఈ అంశంపై బాధిత మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది. జస్టిస్ గిరీష్ కత్పాలియా ఆధ్వర్యంలోని బెంచ్ దీనిపై విచారణ జరిపింది. ఈ అంశం ఒక అసాధారణ పరి స్థితికి సంబంధించిందన్నారు. ఎందుకంటే ఒక సాధారణ మహిళతోపాటు దేశ ప్రధాని ఉన్న ఫొటోకు సంబంధించిన అంశమని కోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ పోలీసులు ఈ విషయంలో సున్నితంగా వ్యవహరించకపోతే కోర్టు సున్నితంగా స్పందిస్తుందని తెలిపింది. ఈ అంశంలో సీజేపీ నేతలకు నోటీసులు జారీ చేసిన కోర్టు ఫొటోలు, దీనికి సంబంధించి అన్ని పోస్టులు తొలగించాలని సోషల్ మీడియా సంస్థ మెటాను ఆదేశించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




