లాక్రోస్ ఛాంపియన్‌షిప్‌కు గోపిక, సంగీత

– విద్యార్థులకు మంత్రి పొన్నం, ప్రభుత్వ సలహాదారు వీహెచ్ అభినందన

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : అంతర్జాతీయ స్థాయిలో మలేషియాలోని కౌలాలంపూర్‌లో ఈనెల 28 నుండి 30 వరకు జరిగే సౌత్ ఈస్ట్ కోస్ట్ లాక్రోస్ ఛాంపియన్‌షిప్-2026 పోటీలకు బీసీ గురుకుల విద్యార్థులు పి.గోపిక, సంగీత ఎంపికయ్యారని బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారులతో పోటీపడి రాష్ట్ర, దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటే పోటీలో బీసీ గురుకుల విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రపంచస్థాయిలో ఈ క్రీడలో భారతదేశ, రాష్ట్ర ఉనికిని పెంపొందించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అన్నారు. వీరిద్దరూ బీసీ గురుకుల పాఠశాలలో 5వ తరగతిలో చేరి ఇప్పుడు ఇంటర్ చదువుతున్నారని పేర్కొన్నారు. కర్నూలు, చెన్నైలో జరిగిన సౌత్ జోన్ ఛాంపియన్‌షిప్ పోటీలో బంగారు పతకం, ఆగ్రా, జమ్ముకాశ్మీర్‌లో జరిగిన పోటీలో పాల్గొని అత్యున్నత ప్రతిభ కనబరిచి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించారని ఆయన తెలిపారు. అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులను ఫిజికల్ డైరెక్టర్స్ అంజలి, మమత, శోభ, లాక్రోస్ క్రీడా కోచ్‌లు శివకుమార్, ఆకాష్, ప్రిన్సిపాల్ శ్రీలతలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, కమిషనర్ బాల మాయాదేవి, సైదులు అభినందించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *