సమాచార భవన్‌లో ఘనంగా బోనాల ఉత్సవాలు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 7: సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్‌లోని సమాచార భవన్(ఎఫ్‌డీసీ కాంప్లెక్స్) కార్యాలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సమాచార శాఖ ఉద్యోగుల కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఉత్సవ ఊరేగింపు, బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊరేగింపులో డప్పు వాయిద్యాలు, పోతరాజుల విన్యాసాలు, సాంప్రదాయ కళారూపాల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ సంచాలకుడు ఎలఎలఆర్ కిషోర్‌బాబు, అదనపు సంచాలకుడు డి.ఎస్.జగన్, మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు, జాయింట్ డైరెక్టర్లు డి.శ్రీనివాస్, కె.వెంకటరమణ, సిఐఈ రాధాకిషన్, డిప్యూటీ డైరెక్టరు సి.రాజారెడ్డి, ఆరఐఈ జయరామ్మూర్తి, సహాయ సంచాలకుడు సత్యనారాయణ రెడ్డి, బిమల్ దేవ్, డిప్యూటీ ఇన్‌ఫర్మేషన్ ఇంజనీర్ నర్సింహగౌడ్, అకౌంట్స్ ఆఫీసర్ పద్మ, టీఎన్‌జీవోస్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, టీజీవో అధ్యక్షుడు యేలూరి శ్రీనివాసరావు, టీఎన్‌జీవోస్ నాయకులు అనిల్, జితేందర్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *