రేపు కిట్స్‌లో స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రాం

వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 7 : కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, వరంగల్ (కిట్స్‌డబ్ల్యు) ఆధ్వర్యంలో 2026-27 విద్యాసంవత్సరానికి బి.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం స్టూడెంట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్(ఎస్‌ఓపి)ను కిట్స్ క్యాంపస్‌లో ఈనెల 8న నిర్వహించనున్నట్లు సంస్థ చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంత రావు తెలిపారు. సెషన్-1 ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని, సీఎస్‌ఈ, ఈసీఈ, ఈసీవీ, ఈఈఈ విభాగాల విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే మధ్యాహ్నం 2గంటలకు సెషన్-2లో సీఎస్‌ఎం, సీఎస్‌డీ, సీఈ, ఎంఈ, ఐటీ, సీఎస్‌ఎన్, సీఎస్‌వో, సీఎస్‌సీ(సైబర్ భద్రత) విభాగాలకు కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ కొత్తగా చేరిన బి.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థులు తమ తల్లిదండ్రులతో శనివారం హాజరుకావాలని కోరారు. అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులు విద్యార్థులకు మౌలిక సదుపాయాలు, ప్రయోగశాలలను పరిచయం చేస్తారన్నారు. అలంనాక్ ఫర్ ఎ వై 2026-27 షెడ్యూల్ పేరుతో విద్యా సంవత్సర ప్రణాళిక అందిస్తారన్నారు. బి.టెక్ మొదటి సంవత్సరం విద్యార్థుల పరిచయ కార్యక్రమం ఈనెల 11-14 స్టూడెంట్ ఇండక్షన్ ప్రోగ్రామ్ (ఎస్‌ఐపి)తోపాటు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.కోమల్ రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ప్రొఫెసర్ పి.రమేష్ రెడ్డి, విభాగాధిపతులు, వివిధ విభాగాల డీన్స్, ప్రొఫెసర్ సూర నరసింహారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ వెంకటేష్, ప్రొఫెసర్ ఎల్.సుధీర్ రెడ్డి(డీన్ పీడీఈ), డీన్ ఎస్‌ఏ ప్రొఫెసర్ కె.శ్రీధర్, ప్రొఫెసర్ రమాదేవి(డీన్ ఆర్ అండ్ డి), ఐక్యూఏసీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ యుఎస్ బాల్‌రాజ్, ఇంటర్న్‌షిప్‌లు, ఎంఓయూల సెల్ ఇన్‌చార్జి ప్రొఫెసర్ ఎం.వీరా రెడ్డి, అకడమిక్ వ్యవహారాల ఫ్యాకల్టీ ఇన్‌చార్జిలు డాక్టర్ పి.నాగార్జున రెడ్డి, డాక్టర్ ఆర్.శ్రీకాంత్, డాక్టర్ ఆర్.రమేష్, అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ పిఆర్‌ఓ డాక్టర్ డి.ప్రభాకరాచారి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థి ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రిన్సిపాల్ కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *