16న జాబ్-మేలా

~ 15 సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పోస్టుల భర్తీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11: అక్షర ఎంటర్‌ప్రైజెస్, బెంగళూరు ఆధ్వ‌ర్యంలో ఈ నెల 16న జాబ్ మేలా నిర్వహించనున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్ మెంట్ బ్యూరో తెలిపింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న బ్యూరో కార్యాలయంలో ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ 15 పోస్టులను అక్షర ఎంటర్‌ప్రైజెస్ భర్తీ చేయనున్నది. ఎంబీఏ, బీబీఏ, ఎంకాం, బీకాం.. ఏదైనా డిగ్రీ చేసిన యువతీయువకు 18 నుండి 35 సంవత్సరాల వయసు వారికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయ్ మెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డిప్యూటీ చీఫ్(యుఈఐ అండ్ జీబీ/ఎంసీసీ) ఒక ప్రకటనలో తెలియజేసింది. రూ.4 లక్షల వార్షిక వేతనం ఉండే ఈ ఉద్యోగాలకు సంబంధించి మరిన్ని వివరాలకు హెచ్‌ఆర్, శ్రేయాస్ (ఫోన్ 9343601037)ను సంప్రదించాలని కోరారు. విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్‌తో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్ మెంట్ బ్యూరో వద్ద నేరుగా 16వ తేదీన హాజరు కావాలని పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *