– ముందస్తుగానే టేక్ హోమ్ రేషన్ పంపిణీకి అనుమతి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ఈనెల 10 నుంచి 21వ తేదీ వరకు 12 రోజులపాటు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. సెలవుల కాలంలో లబ్దిదారులకు సాధారణంగా అందించే వేడి భోజనం (హాట్ కుక్‌డ్ మీల్)కు బదులుగా టేక్ హోమ్ రేషన్ పంపిణీకి అనుమతి ఇచ్చారు. 22వ తేదీ నుంచి రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయి. ఈ మేరకు తమ పరిధిలోని అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు, హెల్పర్లకు అవసరమైన సూచనలు జారీ చేయాలని జిల్లా సంక్షేమ అధికారులు, శిశు అభివృద్ధి ప్రాజెక్టు అధికారులను శాఖ ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల టీచర్ల మాదిరిగానే తమకు బతుకమ్మ, దసరా సెలవులు మంజూరు చేసినందుకు అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లు మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు. అంగన్‌వాడీ చరిత్రలోనే మొదటిసారిగా దసరా సెలవులు ఇచ్చి అంగన్‌వాడీ టీచర్స్‌ని, హెల్పర్స్‌ని బతుకమ్మ సంబరాలు సంబరంగా చేసుకోమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్కకు ఇందిరా ప్రియదర్శిని అంగన్‌వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(ఐఎన్‌టియÖసి) రాష్ట్ర అధ్యక్షురాలు డి.అన్నపూర్ణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





