రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 10 : తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ అధికారుల బదిలీ జరిగింది. 15 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన అధికారుల వివరాలిలా ఉన్నాయి. లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ ‌డీజీగా మహేష్‌ ‌భగవత్‌, ‌హోంగార్డస్ అడిషనల్‌ ‌డీజీగా స్వాతి లక్రా,టిజిఎస్‌పి బెటాలియన్‌ అడిషనల్‌ ‌డీజీగా సంజయ్‌ ‌కుమార్‌ ‌జైన్‌, ‌గ్రేహౌండ్స్ అడిషనల్‌ ‌డీజీగా స్టీఫెన్‌ ‌రవీంద్ర, రాచకొండ కమిషనర్‌గా సుధీర్‌ ‌బాబు, ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్‌ ‌జోషి, మల్టీ జోన్‌ 1 ఐజీ చంద్రశేఖర్‌ ‌రెడ్డి, రైల్వే, రోడ్‌ ‌సేప్టీ ఐజిగా రమేష్‌ ‌నాయుడు, మల్టీజోన్‌ 1ఐజిగా సత్యనారాయణ,హైదరాబాద్‌ ‌సీఆర్‌ ‌హెడ్‌ ‌కోటర్‌ ‌డీసీపీగా రక్షితమూర్తి,మెదక్‌ ఎస్పీగా డి. ఉదయ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, వనపర్తి ఎస్పీగా గిరిధర్‌, ఈస్ట్ ‌జోన్‌ ‌డీసీపీగా బాలస్వామి, సౌత్‌ ‌వెస్ట్ ‌జోన్‌ ‌డీసీపీగా చంద్రమోహన్‌ ‌నియమితులయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *