ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌నిందితులకు ఎదురుదెబ్బ

బెయిల్‌ ‌పిటిషన్లు కొట్టేసిన నాంపల్లి కోర్టు
హైదరాబాద్‌, ‌జూలై 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు నిందితులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నాంపల్లి కోర్టులో నిందితులు దాఖలు చేసిన మ్యాండేటరీ బెయిల్‌ ‌పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. ఏ2 ప్రణీత్‌రావు, ఏ3 తిరుపతన్న, ఏ4 భుజంగరావు, ఏ5 రాధాకిషన్‌రావులకు కస్టడీ పూర్తయిందని, ఇప్పటివరకు ఛార్జిషీట్‌ ‌నమోదు కానందున వారికి బెయిల్‌ ఇచ్చే అధికారం కోర్టుకు ఉందని నిందితుల తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. వారి వాదనలపై అభ్యంతరం వ్యక్తం చేసిన పోలీసులు.. ఛార్జిషీట్‌ ‌దాఖలు చేశామని, దాన్ని తిప్పి పంపినంత మాత్రాన అసలు దాఖలు చేయనట్టు కాదు అన్నారు. గురువారం ఇరువైపులా వాదనలు ముగియగా.. న్యాయమూర్తి శుక్రవారం తీర్పు వెలువరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *