హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్
ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి రూ.70 లక్షలు సీజ్ చేసినట్లు రాధాకిషన్‌రావు విచారణలో వెల్లడిరచారు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్‌రావు, ఆయన బంధువుల నుంచి రూ.కోటి సీజ్ చేశామని అంగీకరించారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన రూ.3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 2016లో ఓ వర్గానికి చెందిన అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.





