కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం

సిట్టింగ్‌ జడ్జి విచారణకు హైకోర్టు నిరాకరణ
కెసిఆర్‌ కాలం చెల్లిన మందు లాంటి వాడు
అసెంబ్లీలో చర్చకు రావాలనే కోరుకుంటున్నా
విూడియాతో సిఎం రేవంత్‌ రెడ్డి చిట్‌చాట్‌

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8:  కాళేశ్వరంపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల అనంతరం చిట్‌చాట్‌లో రేవంత్‌ విూడియాతో మాట్లాడారు. కాళేశ్వరంపై విచారణకు సిట్టింగ్‌ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసిందని చెప్పారు. రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించుకోవాలని హైకోర్టు సూచించిందని గుర్తు చేశారు. హైకోర్టు అంశాలను కేబినెట్‌లో లేదా అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. కృష్ణా .జలాల విషయంలో కేసీఆర్‌ చిత్తశుద్ధిని ప్రజలు చూశారని చెప్పారు. కృష్ణా బేసిన్‌ ప్రజలు బీఆర్‌ఎస్‌ను తిరస్కరించారన్నారు. కేసీఆర్‌, బిఆర్‌ఎస్‌ గురించి ప్రజలు మర్చిపోయారని తెలిపారు. గవర్నర్‌ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్‌ బాధ్యత ఏంటో అర్థమవుతోందన్నారు. కేసీఆర్‌ కాలం చెలిన ఔషధమని పేర్కొన్నారు. విపక్షనేతగా కేసీఆర్‌ అసెంబ్లీకి హాజరు కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.

మిషన్‌ భగీరథపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఉద్యోగ నియామకాల విషయంలో తాము ఎంతో స్పష్టతంగా ఉన్నామని రేవంత్‌ రెడ్డి అన్నారు. మరోవైపు రాజ్యసభ ఎన్నికల్లో ఎవరు పోటీచేస్తారనేది.. అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పారు. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని తెలిపారు. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌కు చాంబర్‌ ఇవ్వాలని కోరారు. వారికి చాంబర్‌ ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వవద్దు అనేది తమ పరిధిలోని అంశం కాదని.. ఇది స్పీకర్‌ పరిధిలోని అంశంగా ఆయన పేర్కొన్నారు.  అధికారం కోల్పోవడాన్ని కేసీఆర్‌ జీర్ణించుకోలేకపోతున్నారని కామెంట్‌ చేశారు. గవర్నర్‌ ప్రసంగానికి కూడా కేసీఆర్‌ హాజరు కాలేదు. దీంతో ప్రతిపక్ష నేత ఏంటో అందరికీ తెలిసిపోతుంది. బీఏసీకి కూడా రాలేదంటే ఆయన చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. హరీశ్‌ రావును ఎలా అడ్డుకుంటాం. బీఆర్‌ఎస్‌.. కేసీఆర్‌, కడియం పేరు ఇచ్చారు.

అనుమతి ఇవ్వాలో లేదో.. స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారు. రేపు హిమాన్ష్‌ కూడా వస్తా అంటాడు. ఎలా ఒప్పుకుంటారని ప్రశ్నించారు.  బడ్జెట్‌ సమావేశాలకు కేసీఆర్‌ రావాలని కోరుకుంటున్నా. ప్రతిపక్ష నేతగా ఆయన బాధ్యత నిర్వర్తించాలి. టీఎస్‌ పీఎస్‌ సీ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అంశాలపై ప్రొసీజర్‌ తో ప్రభుత్వం ముందుకెళ్తోంది. కసబ్‌ కు ఉరి కూడా.. ప్రొసీజర్‌ తోనే జరిగింది. భవిష్యత్తులో నిరుద్యోగులు ఇబ్బందులు పడకూడదు. బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయం మార్పు స్పీకర్‌ నిర్ణయం. అసెంబ్లీ సమావేశాల్లో కులగణన తీర్మానం ఉంటుంది. అవసరం అనుకుంటే సభా సమావేశాలను స్పీకర్‌ పొడిగించవచ్చు. ఐసపశి కి ప్రాజెక్ట్‌ లను గత ప్రభుత్వమే కేంద్రానికి అప్పగించింది. సాగర్‌ ను ఏపీ సీఎం జగన్‌ పోలీసులతో ఆక్రమించినా.. కేసీఆర్‌ ఎందుకు పట్టించుకోలేదని రేవంత్‌ ప్రశ్నించారు.

ప్రతిరోజు 12 టీఎంసీల నీటిని ఏపీకి తీసుకెళ్లినా కేసీఆర్‌ అడ్డుకోలేదు. బేసిన్‌ లు లేవు భేషజాలు లేవని కేసీఆర్‌ ఆయన కమిట్‌ మెంట్‌ కృష్ణా బేసిన్‌ లో బీఆర్‌ఎస్‌ ను ప్రజలు తిరస్కరించారు. సీఎంగా నేను కేసీఆర్‌ ను కూడా కలుస్తా. విజయసాయి రెడ్డి.. ఒక నాన్‌ సీరియస్‌ పొలిటీషియన్‌. అలాంటి వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు‘ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని ఎద్దేవా చేశారు. ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టతతో ఉన్నామన్నారు. విధానపరమైన లోపాలు లేకుండా పాలన సాగిస్తున్నామని సీఎం తెలిపారు. రాజ్యసభ ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేసేది అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *