రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్

– 8 మంది కార్మికుల దుర్మరణం

జైపూర్, నవంబర్ 2 : రోడ్డు నిర్మాణ పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్ తగిలి ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ లోని ఛపోలి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మిల్లర్లో కూలీలు కంకరను కలుపుతుండగా పైన ఉన్న హై-టెన్షన్ విద్యుత్ వైర్ తగలడంతో ఘోరం జరిగి పోయింది. విద్యుదాఘాతానికి గురై ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. హాస్పిట ల్లో చికిత్స పొందుతూ మరో ముగ్గురూ ప్రాణాలు విడిచారు. కాగా ఈ ప్రమాదంపై అధికా రులు దర్యాప్తు చేపట్టారు. ఘటన ఎలా జరిగిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *