హ్యాట్రిక్‌ ‌ఖాయం…మూడోసారి సీఎం కేసీఆరే

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 12 : ‌రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాకులపైగా గెలుస్తామని, మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ‌ప్రమాణ స్వీకారం చేస్తారని బిఆర్‌ఎప్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కెటిఆర్‌ ‌ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి మరింత సానుకూల వాతావరణ ఉందని కెటిఆర్‌ అన్నారు. మంగళవారం ప్రగతి భవన్‌లో మంత్రి కెటిఆర్‌ ‌మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ…ఫీల్డ్ ‌నుంచి వొస్తున్న ఫీడ్‌ ‌బ్యాక్‌ను బట్టి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి కేసీఆర్‌ అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారని, పది సంవత్సరాలల్లో ప్రభుత్వం అందించిన పథకాలు, సంక్షేమ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే అద్భుతంగా వివరిస్తుండడమే ఇందుకు నిదర్శమని తెలిపారు. ప్రజలకు చాలా స్పష్టత ఉందని, ప్రతిపక్షాలే అయోమయంలో ఉన్నాయని, కేసీఆర్‌, ‌బీఆర్‌ఎస్సే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు.

రెండోస్థానం కోసమే ప్రతిపక్షాల పోటీ
ప్రతిపక్షల తాపత్రయమంతా రెండో స్థానం కోసమేనని, బిఆర్‌ఎస్‌లో సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వకుంటే వారు తమ దగ్గరికి వొస్తారని ప్రతిపక్షాలు భావించాయన్నారు. కానీ తాను నిర్మించిన నాయకత్వం, పార్టీ నాయకులపైన తనకున్న నమ్మకం మేరకే కేసీఆర్‌ ‌సిట్టింగ్‌ ‌స్థానాలకు సీట్లు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్‌ ‌మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని కెటిఆర్‌ ‌ధీమా వ్యక్తం చుశారు. 65 సంవత్సరాల్లో ప్రతిపక్షాలు పెట్టిన మెడికల్‌ ‌కాలేజీలు కేవలం రెండేనని, కేంద్రం ఒక్క మెడికల్‌ ‌కాలేజీ ఇవ్వలేదని, కనీసం నర్సింగ్‌ ‌కాలేజీ ఇవ్వలేదని విమర్శించారు. నవోదయ పాఠశాల ఇవ్వలేదన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న అస్థిరత, నాయకత్వ లోపం తెలంగాణలో లేదని, ముఖ్యమంత్రి అభ్యర్థి కేసీఆరేనని, ప్రతిపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో వారికే తెలియదని మంత్రి కెటిఆర్‌ ఎద్దేవా చేశారు. దిల్లీ నుంచి వొచ్చి సీల్డ్ ‌కవర్లు, అందించే మూటలు మాత్రమే ప్రతిపక్షాల పరిస్థితన్నారు.

ముఖ్యమంత్రులను మార్చడానికి మత కల్లోలాలను లేపి మరణహోమం సృష్టించి, మనుషులను చంపిన పార్టీ కాంగ్రెస్‌ అని, తమ పార్టీ నాయకులపైననే చెప్పులు విసిరి పార్టీ అని, తెలుగువారి గౌరవం పీవీ నరసింహారావుపైనే చెప్పులు విసిరిన ఘనత కాంగ్రెస్‌ ‌దని విమర్శించారు. దిల్లీ బానిస పార్టీలు జాతీయ పార్టీలులని, ఆత్మగౌరవం అధికంగా ఉన్న తెలంగాణ ప్రజలు ఈ బానిసత్వ పార్టీలను అంగీకరించరని, తెలంగాణ ప్రజలకు దిల్లీ బానిసలు కావాలా ? తెలంగాణ బిడ్డ కావాలా తెలుసుకోవాలనపి ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ‘కేవీపీ రామచంద్రరావు, షర్మిల ఇప్పుడు తెలంగాణ వాదులమని చెప్పుకుంటున్నారని, వాళ్లు నేడు కాంగ్రెస్‌ను గెలిపిస్తారంట అంటూ కెటిఆర్‌ ‌వ్యంగ్యోక్తులు విసిరారు. కనీసం ఎమ్మెల్యే పదవి వొదిలిపెట్టలేని కిషన్‌ ‌రెడ్డి, తెలంగాణ ప్రజలపైన రైఫిల్‌ ‌తీసుకువెళ్లిన రేవంత్‌ ‌రెడ్డిలు నేడు తెలంగాణ కోసం ముసుగులో వొచ్చారని కెటిఆర్‌ ‌మండిపడ్డారు. రేవంత్‌ ‌తెలంగాణ వాది కాదు..తెలంగాణకు పట్టిన వ్యాధి అని, తెలంగాణ కాంగ్రెస్‌ ‌నాయకులు ఒకరైన తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా…రాజీనామా చేశారా అంటూ ఆయన ప్రశ్నించారు.

పాలమూరు ప్రాజెక్టుపై కేసులు వేసి అడ్డంకులు..
నాడు పాలమూరు ప్రాజెక్టుపై కేసులు వేసి అడ్డంకులు సృష్టించిన పార్టీలు నేడు ఈ ప్రాజెక్టు ప్రారంభాన్ని ప్రశ్నిస్తున్నాయని కెటిఆర్‌ ‌మండిపడ్డారు. 1963లో నెహ్రూ శంకుస్థాపన చేసిన ఎస్సారెస్పీ కాలువను నిన్నమొన్నటి దాకా కాంగ్రెస్‌ ‌నాయకులు ప్రారంభించలేదా..అంటూ ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌, ‌రంగారెడ్డి జిల్లాలోని 13,14 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే ఈ ప్రాజెక్టును అందరూ స్వాగతించాలని కెటిఆర్‌ అన్నారు.

బిజెపి  వన్‌ ‌నేషన్‌..‌వన్‌ ఎలక్షన్‌’ ఓ ‌జిమ్మిక్‌
‌తన వైఫల్యాలను కప్పిపుచ్చుకొని ప్రయత్నంలో భాగంగా బిజెపి ‘వన్‌ ‌నేషన్‌..‌వన్‌ ఎలక్షన్‌’ అనే జిమ్మిక్‌ను ముంఉకు తెచ్చిందని కెటిఆర్‌ అభిప్రాయపడ్డారు. దేశంలో మోదీని తమ పార్టీ విమర్శించినంతగా ఏ ఇతర పార్టీ అయినా విమర్శ చేసిందా..అంటూ ఆయన విమర్శించారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ అవగాహనలో ఉన్నాయని, అందుకే బీజేపీని కాంగ్రెస్‌ ‌నాయకులు విమర్శించరని అన్నారు. తమ పార్టీ నాయకులపై ఈడీలు దాడి చేశాయని కానీ ఒక్క కాంగ్రెస్‌ ‌నాయకుడిపైనా కేంద్ర ఏజెన్సీలు దాడులు చేశాయా? అంటూ ప్రశ్నించారు. ఇక ఏపీలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడడానికి ఏం లేదని, పక్కరాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తమకు ఏం సంబంధం లేదని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page