హైదరాబాద్‌లో మరో ఘాతుకం

  • కార్ఖానాలో బాలికపై ఐదుగురు అత్యాచారం
  • రెండు నెలలుగా సాగుతున్న వ్యవహారం..ఆలస్యంగా వెలుగులోకి
  • ఐదుగురిని అరెస్ట్ ‌చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
  • జూబ్లీహిల్స్ ‌ఘటన మరవక ముందే మరో దుస్సంఘటన

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 7 : ‌హైదరాబాద్‌లో అత్యాచారాల పరంపర కొనసాగుతుంది. రోజుకో దారుణం వెలుగు చూస్తుంది. జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచార ఘటన మరవక ముందే సికింద్రాబాద్‌ ‌కాఱ్ఖానా పిఎస్‌ ‌పరిధిలో మైనర్‌పై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వొచ్చింది. కార్ఖానా పీఎస్‌ ‌పరిధిలోని లాడ్జిలలో వేర్వేరు రోజుల్లో బాలికపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. విచారణ చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను, లాడ్జి నిర్వాహకులను అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలికతో సోషల్‌ ‌వి•డియాలో పరిచయం పెంచుకున్న నిందితులు… మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నారు. స్నేహం పేరుతో బాలికను ఆ యువకులు మభ్యపెట్టారు. లాడ్జిల్లో వేర్వేరు రోజుల్లో ఆ ఐదుగురు లైంగిక వాంఛ తీర్చుకున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కార్ఖానా పోలీసులు… దర్యాప్తు చేపట్టారు. బాలిక తండ్రి విజ్ఞప్తి మేరకు గోప్యంగా విచారణ జరిపారు. ఐదుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈమేరకు మే 30న కేసు నమోదు చేసిన పోలీసులు…అత్యాచారం చేసిన ఐదుగురు యువకులు, ఇద్దరు లాడ్జ్ ‌నిర్వాహకులను అరెస్ట్ ‌చేసి రిమాండ్‌ ‌తరలించారు. అయితే కార్ఖానా పీఎస్‌ ‌పరిధిలో జరిగింది గ్యాంగ్‌ ‌రేప్‌ ‌కాదని పోలీసులు చెబుతున్నారు.

కార్ఖానా పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో ఓ బాలికను ఇద్దరు యువకులు ట్రాప్‌ ‌చేశారని పోలీసులు వెల్లడించారు. ఐదుగురు యువకుల్లో ఇద్దరు మైనర్లున్నారని తెలిపారు. అమ్మాయితో స్నేహంగా ఉంటూనే యువకులు లైంగిక వాంఛ తీర్చుకున్నారన్నారు. ఇద్దరి మైనర్లు, ముగ్గురు మేజర్లతో పాటు ఇద్దరు లాడ్జి నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. ఎవరికి వారు బాలికను ట్రాప్‌ ‌చేసి లైంగిక కోరిక తీర్చుకున్నారని పోలీసులు తెలిపారు. ధీరజ్‌, ‌రితేష్‌ అనే యువకులతో బాలికకు కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రాంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే రోజూ మాట్లాడుతూ బాలికతో చనువు పెంచుకున్నారు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం ఒక రోజు హోటల్‌ ‌గదికి రప్పించి బాలికపై వీరిద్దరూ అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఆ సమయంలో వీడియోలు తీసి.. బెదిరిస్తూ రెండు నెలలుగా ఆమెపై అత్యాచారం జరుపుతూ నరకం చూపిస్తున్నారు. ఇక ఇటీవల ఆ వీడియోలు ఇచ్చేస్తాం రమ్మని నమ్మబలికి మరోసారి లాడ్జ్‌కి పిలిచి తన మిత్రులతో సైతం బాలికపై ధీరజ్‌ ‌రేప్‌ ‌చేయించాడు. రెండు నెలలుగా బాధితురాలు ఈ విషయాల గురించి ఎవరికీ చెప్పలేదు. కానీ మానసికంగా కృంగిపోతుండటంతో తల్లిదండ్రులు ఆమెను సైక్రియాటిస్ట్ ‌దగ్గరకు తీసుకెళ్ళారు. తనపై రెండు నెలలుగా జరుగుతున్న అత్యాచారానికి సంబంధించిన అన్ని విషయాలను ఆమె సైక్రియాటిస్ట్ ‌వద్ద వెల్లడించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు మే 30న కార్ఖానా పోలీస్‌ ‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ మైనర్‌తో పాటు ఇద్దరిని అరెస్ట్ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page