సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ, నిత్య నూతన ఆవిష్కరణలు చోటు చేసుకుం టున్న తరుణంలో ప్రచార ప్రసార మాధ్యమాలలో విప్లవాత్మక మార్పులు క్షణక్షణం జరుగు తున్నాయి. వాటన్నిటి కన్నా ప్రస్తుతం నిరక్షర గ్రామీణుల నుండి నిరంతర పరిశోధకుల వరకు చేతిలో అందుబాటు లోకి వచ్చాయి. అధునాతన సెల్ ఫోన్లు, వాటి ద్వారా ప్రధాన స్రవంతిలోని మీడియాను మించి సోషల్ మీడియా పని చేయడం సర్వత్రా కనిపిస్తున్నది. చేతిలో సెల్ ఫోన్ లేకుండా, పొద్దున లేచింది లగాయతు, రాత్రి నిద్రించే వరకు, సోషల్ మీడియాలో నిమగ్నం కాని వారు ఉంటారా అన్నది సందేహా త్మకమే. సోషల్ మీడియా అంతగా ప్రభావం చూపుతున్న ఈ రోజులలో ఎన్నికల సంబంధ అంశాలు, వేగవంత ప్రచారాలకు, సమాచార చేరవేతలకు సామాజిక మాధ్యమాల పాత్ర ఆద్వితీయం, అపూర్వం, అసమానమైంది. గతంలో ఎన్నికలు వస్తున్నాయన గానే గ్రామ గ్రామాన గోడమీద రాతలు ప్రత్యక్ష మయ్యేవి. కాగితాలపైన, ఆపై ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ముద్రితాలైన అభ్యర్థుల వివరాలు, వీలేతై ఫోటోలు, ఎన్నికల గుర్తులతో ఇంటింటికీ తలుపులపై, ఆపై జన సమ్మర్త అనుకూల ప్రదేశాలలో అతికించ బడేవి.
తర్వాతి కాలంలో బ్యానర్లు, ఫ్లెగ్జీలు, పోస్టర్లు, కటౌట్లు, కర పత్రాలు, గోడ పత్రికలు, ఎన్నికల వాగ్దానాల, హామీలతో కూడిన బ్రోచర్లు. అన్ని వనరుల వినియోగం ప్రచారానికి ఉపయోగించడం ఆచరణలోకి వచ్చింది, ఇటీవలి కాలంలో ఎన్నికలలో వీటికి తోడు రికార్డెడ్ వాయిస్ ఫోన్ కాల్స్ ద్వారా ప్రజలకు అభ్యర్థులు స్వయంగా తమ విజ్ఞప్తులను వినిపించడం జరిగింది. ప్రసార మాధ్యమాలలో స్క్రోలింగ్ లు, యాడ్స్, జన ప్రవంతిలో గల వివిధ పత్రికలపెయిడ్ ఆర్టికల్స్ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహింప బడేవి. రానురాను ఎన్నికల కమిషన్ దృష్టి అధికమవు తుండడం, శాసన సభలో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల వ్యయంకు సంబంధించి ఖచ్చితమైన నిబంధన లుండడం, నిర్ణీత ఖర్చుకు సంబంధించి, లక్ష్మణ రేఖ దాటినట్లు రుజువైతే, గెలిచినా పదవి పోవడం ఖాయమని, ఖచ్చితమైన పాటింపులు ఉండడంతో అభ్యర్ధులు, వారి అనుచరులు, అభిమానులు, ప్రత్యర్థులు, వారి అనుచర గణాలు, ప్రత్యామ్యాయాలపై దృష్టిపెడు తున్నారు. ఆ లోపునే ఖర్చు చేయడమే కాక నామినేషన్ వేసినప్పటి నుంచి ప్రతిపైసాకు తప్పని సరిగా లెక్క చూపాల్సిందే. అలాగని ఎక్కువ ఖర్చు చేసినా తక్కువ చూపితే సరిపోదు. అభ్యర్థులు వినియోగించే ప్రచార సామగ్రి, ప్రచారానికయ్యే ఖర్చులను, వెంట వచ్చే మద్దతు దారులు, కార్యకర్తలకు టీలు, టిఫిన్లు తదితరమైన వాటికి మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకొని జిల్లా ఎన్నికల అధికారి నిర్ణయిస్తారు. నేటి సమాజంలో ఎన్నికల్లో బాగా ఖర్చు పెట్టగల వ్యక్తులను మాత్రమే పార్టీ అభ్యర్థులుగా ఎంపిక అవుతున్నారు. అవినీతి కూడా కొలమానంలో లేకుండా పోతోంది.
దీన్ని కప్పి పుచ్చెందుకు, ముఖ్యంగా సామాజిక మాధ్యమాల ద్వారా క్షణాలలో వేలాది మందికి గ్రూపుల ద్వారా పోస్టులు శరవేగాన్ని సవాలు చేస్తూ వెళుతున్నాయి. ఎన్నికలకు 48 గంటలకు ముందుగా ప్రచారం చేయకూడదు. ప్రచార రూపంలో ఎస్‌ఎంఎస్‌లు కూడా నిషేధ మని నిబంధనలు కఠినంగా ఉన్నాయి. అయినా ప్రధానంగా సాంప్రదాయక ప్రసార, ప్రచార సాధనాలకు పరిమితులు ఉండి, ఉన్నదున్నట్లు ప్రచురించే, ప్రసారం చేసే అవకాశాలు లేని, రాయడానికి, మాట్లాడడానికి వీల్లేని, నిఘంటువు లలో చోటు చేసుకోని, అసభ్య, అమానుష, అప్రజాస్వామిక భాష రాజ్య మేలుతున్న స్థితిలో సామాజిక మాధ్యమాలు అడ్డూ, అదుపూ లేని నేరుగా, వీడియో, ఆడియో రికార్డింగులు, మార్ఫింగులు, ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్టుగా, వెనువెంటనే సెల్ఫోన్ల ద్వారా గమ్యాలకు చేరుస్తున్నాయి. పొగడ్తలూ, తెగడ్తలూ, సత్, దుష్ప్రచారాలు తేడా లేకుండా, అస్మదీయుల, తస్మదీయులనే భేదాలు లేకుండా ఇష్టా రాజ్యంగా వైరల్ అవుతున్నాయి. పైగా ఎవరి స్వాధీనంలో లేని, పైసా ఖర్చుకాని, నియంత్రణ ఊసే కానరాని సదరు మాద్యమాల ద్వారా జరుగుతున్న పోస్టింగుల ప్రచార పరంపరనే ప్రస్తుతం ఎన్నికలలో ప్రధాన భూమికలు నిర్వహిస్తున్నాయి. తామే ఉద్యమాలను, ప్రభుత్వాలను నడిపిస్తున్నామని, ఎవరు గెలవాలో, ఎవరు ఓడలో తమ నిర్ణయానుసారమే జరుగుతుందని భావించే, భ్రమించే, ఆత్మ వంచన చేసుకునే పార్టీల మానస పుత్రికలైన పత్రికలకు, ఛానళ్ళకు సమాంతరాలుగా సామాజిక మాధ్యమాలు పని చేస్తున్నాయి.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494