తనిఖీల్లో ఆశ్చర్య పోయిన అధికారులు
జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్ 29 : శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్ లో ఫుడ్ సేప్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేసిన అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. హాస్టల్ లో పిల్లలకు వడ్డించే వస్తువులు కాలం చెల్లినవిగా గుర్తించారు. పాల ప్యాకెట్ నుండి నిల్వ ఉంచే పదార్థాలన్ని కుళ్లినవిగా నిర్దారించారు. జగిత్యాల జిల్లా జాబితాపూర్ లోని శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్ లో ఫుడ్ సేప్టీ అధికారులు రైడ్ చేశారు.
ఆహార పదార్దాల్లో పురుగులు,నాసిరకంగా ఉన్న పదార్థాలు వినియోగిస్తున్నారని గుర్తించారు. కాలం చెలిన వస్తువులను చెత్తలో అధికారులు పడేశారు. 3వ తరగతి నుండి 10 వ తరగతి వరకు హాస్టల్ లో వందలాది మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నట్టు గుర్తించారు. ఇలాంటి వస్తువులు తినడం వలన విద్యార్థులు అనారోగ్యలకు గురవుతారని అన్న ఫుడ్ సేప్టీ అధికారులు తెలిపారు. యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేప్టీ అధికారి అనూష తెలిపారు.