- ఆ విషయాన్ని ప్రపంచం గ్రహిస్తున్నది
- దేశ ఆర్థిక, వ్యాపార రంగాలలో ఐఎస్‌బి విద్యార్థులది ప్రముఖ పాత్ర
- విద్యార్థులు వ్యక్తిగత లక్ష్యాలను దేశం లక్ష్యాలతో జోడించాలి
- భారత్ 100కు పైగా దేశాలకు కోవిడ్ టీకాలను పంపించింది
- ఐఎస్‌బి ద్విదశాబ్ది ఉత్సవంలో ప్రధాన మంత్రి మోడీ
హైదరాబాద్, పిఐబి, మే 26 : ప్రస్తుతం భారతదేశం జి20 దేశాల సమూహంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థగా ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. స్మార్ట్ ఫోన్ డేటా వినియోగదారులలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉందని, ఇంటర్ నెట్‌ను వినియోగించే వ్యక్తుల సంఖ్యలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందని ఆయన అన్నారు. గ్లోబల్ రిటైల్ ఇండెక్స్‌లో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు. ప్రపంచంలో మూడో అతి పెద్ద స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ భారతదేశంలో ఉందని, మూడో అతి పెద్ద వినియోగదారుల బజారు భారతదేశంలో ఉందని ప్రధాని తెలిపారు. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్‌బి) 20 సంవత్సరాల కాలం పూర్తి అయిన సందర్భంలో ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. 2022వ సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ పోగ్రామ్(పిజిపి) క్లాస్ గ్రాడ్యుయేషన్ ఉత్సవాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..విద్యా సంస్థకు ఇంత గౌరవానికి అర్హమైందిగా మలచడంలో తోడ్పాటును అందించిన వారందరికి నమస్సులను అర్పించారు. పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ ఈ సంస్థను 2001వ సంవత్సరంలో దేశానికి అంకితం చేశారని ఆయన గుర్తు చేశారు. అప్పటి నుంచి చూస్తే, ఐఎస్‌బి నుంచి 50,000 మందికి పైగా ఎగ్జిక్యూటివ్‌లు ఉత్తీర్ణులు అయ్యారని, ప్రస్తుతం ఆసియాలోని అగ్రగామి బిజినెస్ స్కూల్స్‌లో ఐఎస్‌బి స్థానాన్ని సంపాదించుకుందని తెలిపారు. ఐఎస్‌బి నుంచి ఉత్తీర్ణత పొందిన వృత్తి నిపుణులు ప్రముఖ కంపెనీలలో ఉన్నత స్థానాలలో ఉంటూ, దేశ వ్యాపారానికి ఒక వేగ గతిని అందిస్తున్నారని అన్నారు.
ఐఎస్‌బి నుంచి వొచ్చిన విద్యార్థులు వందల కొద్దీ స్టార్ట్-అప్స్‌ను ఏర్పాటు చేశారని, యూనికార్నస్‌ను సృష్టించడంలో వారూ పాత్రను పోషించారన్నారు. ‘‘ఇది ఐఎస్‌బి కార్యసాధనలలో ఒకటి. మరి అంతే కాకుండా ఇది యావత్తు దేశానికి గర్వకారణంగా నిలిచింది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం ప్రస్తుతం వృద్ధి పరంగా ఒక ప్రధానమైన కేంద్రంగా తెర మీదకు వొస్తున్నదని, కిందటి సంవత్సరంలో, అత్యధిక స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డిఐ) భారతదేశానికి తరలివచ్చిందని, ప్రస్తుతం భారతదేశం వ్యాపారానికి పెద్ద పీటను వేస్తుందనే విషయాన్ని ప్రపంచం అర్థం చేసుకొంటుందని ఆయన అన్నారు. తరచుగా భారతదేశం కనుక్కున్న పరిష్కారాలను ప్రపంచం అంతటా అమలుపరచడం జరుగుతుందని ప్రధాన మంత్రి చెప్పారు. ‘‘ఈ కారణంగా ముఖ్యమైనటువంటి ఈ రోజున, నేను మిమ్మల్ని ఒకటి కోరదలచాను.. మీ యొక్క వ్యక్తిగత లక్ష్యాలను దేశం యొక్క లక్ష్యాలతో జోడించుకోండి’’ అని విద్యార్థులకు ఆయన విజ్ఞప్తి చేశారు. సంస్కరణల ఆవశ్యకత అనేది దేశంలో ఎప్పటికీ ఉన్నదని, అయితే లేనిదల్లా రాజకీయ సంకల్ప శక్తి అని ప్రధాన మంత్రి అన్నారు. గడచిన మూడు దశాబ్దాలలో రాజకీయ అస్థిరత్వం అదే పనిగా ఏర్పడుతూ వొచ్చినందువల్ల దేశంలో చాలా కాలం పాటు రాజకీయ ఇచ్ఛాశక్తిలో లోపం అగుపించిందని, ఈ కారణంగా దేశం సంస్కరణల జోలికి పోలేదని, పెద్ద నిర్ణయాలను తీసుకోవడానికి దూరంగా ఉండిపోయిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.
2014వ సంవత్సరం నుంచి, మన దేశం రాజకీయ సంకల్పాన్ని గమనిస్తూ వొస్త్తుందని, అంతేకాదు, సంస్కరణలను అదేపనిగా చేపట్టడం జరుగుతుందని, ఎప్పుడైతే సంస్కరణలను దృఢ దీక్షతో, రాజకీయ శక్తితో చేపట్టడం జరిగిందో అప్పుడు ప్రజల సమర్థన ఖాయంగా లభిస్తుందని స్పష్టం చేశారు. డిజిటల్ పేమెంట్స్‌ను ప్రజలు అనుసరిస్తూ ఉండడం దీనికి ఒక ఉధాహరణగా ఉందని ఆయన చెప్పారు. మహమ్మారి కాలంలో ఆరోగ్య రంగం యొక్క బలం, ఆటుపోటులను ఎదుర్కునే శక్తి నిరూపణ అయిందని ప్రధాన మంత్రి అన్నారు. కోవిడ్ టీకామందులను గురించి ఆయన ప్రస్తావిస్తూ..విదేశీ టీకాలు అందుబాటు లోకి వొస్తాయో, రావో అనే ఆందోళనలు నెలకొన్న సమయంలో భారతదేశం తన సొంత టీకామందులను అభివృద్ధి పరచిందని ప్రధాని అన్నారు. భారతదేశంలో చాలా టీకాలలను సిద్ధం చేయడం జరిగిందని, 190 కోట్లకు పైగా డోసులను ఇప్పటికే ప్రజలకు ఇప్పించడం జరిగిందని, భారతదేశం ప్రపంచంలో 100కు పైగా దేశాలకు టీకాలను పంపించిందని ఆయన అన్నారు. వైద్య విద్య విస్తరణను వివరిస్తూ..సంస్కరణ పక్రియలో అధికారి వర్గం మొక్కవోని తోడ్పాటులను అందించిందని ప్రధాన మంత్రి అన్నారు. ప్రభుత్వ పథకం సఫలం అయిందంటే ఆ ఖ్యాతి ప్రజల భాగస్వామ్యానిదని ఆయన చెప్పారు. ప్రజలు సహకరించారంటే తక్షణ ఫలితాలు, ఉత్తమ ఫలితాలు తప్పక ఒనగూరుతాయని ఆయన అన్నారు. ఇప్పుడున్న వ్యవస్థలో, ప్రభుత్వం సంస్కరణలను తీసుకువొస్త్తుందని, అధికారి వర్గం ఆచరణలోకి తీసుకు వొస్త్తుందని, ప్రజల భాగస్వామ్యం పరివర్తనకు దారి తీస్తున్నదని ఆయన అన్నారు. సంస్కరించడం, అమలుపరచడం, మార్పును తీసుకురావడం అనేటటువంటి ఈ యొక్క విధానాన్ని అధ్యయనం చేయండంటూ ఐఎస్‌బి విద్యార్థులకు ఆయన సూచించారు.
2014వ సంవత్సరం తరువాత కాలంలో ప్రతి ఒక్క క్రీడలో మనం గొప్ప ప్రదర్శనను గమనిస్తున్నామంటే దానికి అతి పెద్ద కారణం మన క్రీడాకారులలో ఏర్పడిన ఆత్మవిశ్వాసమని ప్రధాన మంత్రి అన్నారు. సరి అయిన ప్రతిభను కనుగొనడం జరిగిందంటే ప్రతిభకు సరి అయిన అవకాశాలను కల్పించడం జరిగిందంటే, ఎంపిక పారదర్శకంగా జరిగిందంటే, శిక్షణకు, పోటీపడడానికి మెరుగైన వసతి సదుపాయాలు అమరాయంటే అప్పుడు విశ్వాసం అంకురిస్తుందని ఆయన వివరించారు. ఖేలో ఇండియా మరియు టాప్స్ స్కీముల వంటి సంస్కరణల కారణంగా క్రీడలలో చోటు చేసుకొన్న మార్పు మన కళ్ళెదుట కనిపిస్తూనే ఉందని అన్నారు. అదే విధంగా మహత్వాకాంక్ష భరిత జిల్లాల కార్యక్రమం అనేది పనితీరుకు, విలువ జోడింపునకు, ఉత్పాదకతకు, అలాగే సార్వజనిక విధాన రంగంలో ప్రేరణకు ఒక గొప్ప ఉదాహరణగా నిలచిందని ఆయన అన్నారు.
దేశంలో వ్యాపార రంగంలో పరిస్థితులు అంతకంతకు మార్పునకు లోనవుతున్నాఅనే అంశాన్ని ప్రస్తావిస్తూ..సంఘటిత, అసంఘటిత, చిన్న, పెద్ద వ్యాపారాలు వాటి వాటి పరిధులను విస్తరించుకొంటున్నాయని, దీని ద్వారా లక్షల, కోట్ల మంది కి ఉపాధి లభిస్తుందన్నారు. చిన్న వ్యాపారాలు వృద్ధి చెందడానికి మరిన్ని అవకాశాలను ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యాపారాలు స్థానికం గాను, ప్రపంచ స్థాయిలోను కొత్త కొత్త మార్కెట్లతో జత కలిసేటట్లుగా వాటికి సాయపడాలని ఆయన అన్నారు. ఆ వ్యాపారాలలో ఉన్న అపారమైన అవకాశాలను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ..భారతదేశాన్ని రాబోయే కాలానికి తగినట్లు సిద్ధం చేయాలంటే గనక అందుకోసం మనం భారతదేశం ఆత్మనిర్భరతను సాధించేటట్లుగా చూడాలని నొక్కిచెప్పారు. ఐఎస్‌బి వంటి సంస్థల విద్యార్థులకు ఇందులో ఒక గొప్ప పాత్ర ఉంటుందని ఆయన అన్నారు. ‘‘వ్యాపార రంగంలో వృత్తి నిపుణులు అయిన మీకందరికీ దీనిలో ఒక ప్రధానమైన పాత్రంటూ ఉంది. మరి ఇది మీరు దేశానికి సేవ చేసేందుకు ఒక గొప్ప అవకాశం కాగలదు’’ అని ప్రధాని అన్నారు.