దగాపడ్డ దెబ్బతిన్న
పులిలా కలియ తిరుగుతున్నది
ఇక్కడ జీవన్మరణ పోరాటం !
ద్రోహాలు మోసాలు ఎదురైన ఏటికి
ఎదురీదుతూ
నిన్న నైజాం నేడు కెసిఆర్
సాదు జంతవులైనాయా?
బతుకు దెరువు కోసం
తెలంగాణ మంత్రం
జపించకుంటే తప్ప
ఉప్పు పుట్టదు
‘‘ఒడ్డుదాటే వరకు ఓడ మల్లన్న
ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న
అన్న సంగతి తెలియదా ?
కుట్రదారుడ్ని తెలంగాణని ద్రోహిని చేశారు
ఈ పుట్టడం పుట్టిన పాపానికి ఆకలెయ్యటం పిడికిలుండటం నేరమైంది !
అక్కడొక్కడో ఆడపిల్లల్ని
కనటం అపరాధమైంతే
తెలంగాణలో మగపిల్లల్ని కనటం మహాపరాధమైంది
కనిపించిన తల్లులకు ఎదిగిన
కొడుకులుండటం నేరమైంది !
చూపుడు వేలు మీద సిరా
చుక్క ఆరకముందే
వోటు ఉరితాడై బిగుసుకుంది
-శోభ రమేష్
8978656328