ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి దశాబ్దం కావస్తోంది. విభజన హామీలు అన్నీ అలాగే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ విభజన ప్రక్రియ సక్రమంగా చేయలేదనీ .. తల్లినిబిడ్డను వేరు చేశారని ఆ తరవాత మోదీ అన్నారు. ఎవరు అధికారంలోకి వొచ్చినా సమస్యలు మాత్రం గట్టెక్కలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచ ందంగా ఉంది. విభజనకు ముందుతో పోలిస్తే తెలంగాణ అభివృద్దిలో దూసుకు పోతోంది. సమైక్య రాష్ట్రంలో సాకారం కాని అనేకానేక పథకాలు, పనులు చేపట్టి చరిత్ర సృష్టించారు. కేంద్రం అండగా లేకున్నా..సరైన సమయంలో పనులు చేయకున్నా.. నిధులు విడుదల చేయ కున్నా.. అరకొర నిధులే విడుదల చేసినా.. తెలంగాణ అగ్రపథాన పయ నిస్తోంది. వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తిరుగు లేని విజయాలు నమోదు చేసుకుంది. పారిశ్రామిక ప్రగతి, ఐటి విస్తరణలో చంద్రయాన్‌లా సాగుతోంది. ఇది ఎవరు కాదనలేని నిజం. కులవృ త్తులకు జీవం పోశారు. ఈ క్రమంలో ఎపికి ప్రత్యే• •హోదా అన్నది ఇక ముగిసిన అధ్యాయం. దశాబ్దకాలంగా దీనిపై దాగుడుమూతలు ఆడారు. చంద్రబాబును విమర్శించి గద్దెనెక్కిన జగన్ కూడా దాగుడు మూతల్లో ఆరితేరారు. ఆయన కేంద్రంతో సఖ్యంగా ఉన్నారు. కేంద్రాన్ని నొప్పించకుండా కాలం వెళ్లబుచ్చుతున్నారు. రాజధాని అన్నది లేకుండా చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టును యుద్దప్రాతిపదికన పూర్తి చేయడంలో కెసిఆర్ తన సమర్థతను చాటారు. ఒక్క కాళేశ్వరమే గాకుండా మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి భారీ జలాశయాలను నిర్మిం చారు. విద్యుత్ నిరంతరంగా ఉంటే పారి శ్రామక• ప్రగతికి ధోకా ఉండదని భావించి ఇందులో దేశంలోనే ఎవరూ చేయని సాహసం చేశారు. కానీ ఎపిలో కేంద్రం అడందండలు ఇచ్చినా..నిధులు సమ కూర్చినా పోలవరం ఇంకా నానుతూనే ఉంది. రాజధాని అమరావతి అటకెక్కింది. రెండు రాష్టాల్ర మధ్య ఈ పదేళ్ల కాలంలో జరిగిన అభవృద్దిని పోల్చడానికి ఇంతకన్నా గీటురాళ్లు అక్కర్లేదు. కాశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు తరవాత రాష్టాల్రకు ప్రత్యేక హోదాలను పక్కన పెట్టారు. ఈ కారణ ంగానే ఎపికి ప్రత్యేక హోదా అన్న అంశం ఇక తెరపైకి రాదు. మళ్లీ దీనిపై పోరాడా లన్న ఆలోచన కూడా సరికాదు. అయితే ఎపితో పాటు తెలంగాణ సమస్యలను పరిష్కరించి నిధులు కేటాయించే విషయ ంలో కేంద్రం ఉదారంగా ఉండాలి. అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నం చేయాలి. రాష్ట్రాల మధ్య అంతరాలు లేకుండా చూడాలి. రాష్ట్రాలు బల పడేలా కేంద్రం అందుకు సహకరించాలి. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలను అభివృద్దిలో ముందుండేలా చేయాలి. ఇందులో భాగంగా ఎపి విభజనకు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలి. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామనీ, పన్ను రాయితీలను కల్పిస్తామనీ, ఆదా యంలో ఉన్న వ్యత్యాసాన్ని భర్తీ చేస్తామనీ ఆనాటి ప్రధాని మన్మోహన్ చెప్పిన హాలేవీ అమలుకు నోచుకో లేదు. రాష్ట్రంలో బాగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధి ప్యాకేజీకి కూడా అతీగతీ లేదు. రాజధాని నిర్మాణా నికి అవసరమైన నిధుల కేటాయింపు విషయమై కేంద్రం నోరు మెదపడం లేదు. విభజన సమస్యలు, అసెంబ్లీ సీట్ల పెంపు, ఉద్యోగుల పంపకాలు, కొత్త రాష్టాన్రికి రాజధాని నిర్మించడం, ఆర్థికంగా అండగా నిలబడడం వంటి సమస్యలన్నీ మిధ్య అని తేలిపోయింది.
ఇప్పటకీ పదేళ్లు పూర్తి కావొస్తున్నా ఇంకా అనేక సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. తెలంగాణ మరోమారు ఎన్నిక లకు వెళుతోంది. ఎపిలో వొచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్నాయి. ప్రభుత్వ పనితనానికి గీటురాయి ఏంటంటే సమస్యలను ఎలా పరిష్కరించు కుంటు న్నారో తెలంగాణను చూస్తే తెలుస్తుంది. ఆయా సమస్యలను ఎంత త్వరగా పరిష్కరి ంచారో వాటిని బట్టి కేంద్ర ప్రభుత్వ పనితీరును గుర్తించాల్సి ఉంటుంది. కానీ ఈ విషయంలో కేంద్రం పనితీరు గత కొన్నేళ్లుగా పరిశీలిస్తున్నా సానుకూల ధోరణి కానరావడం లేదు. ఏడు మండ లాలను ఆగమేఘాల ద ఎపిలో కలుప డానికి చొరవ చూపిన తెగువ మిగతా విషయాలపైనా చూపివుంటే ఈ పాటికి విభజన సమస్యలు కొలిక్కి వొచ్చేవి. కీలక నిర్ణయాలు సత్వరంగా తీసుకుంటే వాటి ఫలాలు ప్రజలకు చేరుతాయి కనుక ప్రభు త్వం త్వరగా నిర్ణయాలు తీసుకోవాలి. నదీజలాల విషయంలో కూడా తాత్సారం కారణంగా తరచూ విభేదాలు వొస్తూనే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అవసరం లేదని, విభజన చట్టంలో పేర్కొన్న హాలన్నీ నెరవేర్చామం టున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇక లేదని తేలిపోయింది కనుక రాజకీయ నాయకులు కూడా ఈ విషయమై రాజకీయం చేయకుండా ఎపి అభివృద్ధితో పాటు ఆర్థికంగా కేంద్రసాయంపై పోరాడాలి. ఇప్పటివరకు ప్రత్యేకహోదా వొస్తుందని ఆశతో ఎదురు చూసిన ఆం• ్రప్రదేశ్‌కు, కేంద్రం యూటర్న్ తీసుకుంది. ఇక దీనిపై చర్చ చేయడం కూడా అనవస రమేనని గుర్తుంచుకోవాలి. రాజధాని లేకుండా కొత్త రాష్ట్రం మనుగడ సాగు తోంది. ఇచ్చిన హా ప్రకారం వెనుక బడిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరి ంచాలి. రెవెన్యూ లోటులో రాష్ట్రం ఉంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర మొత్తం ఏడు జిల్లాలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రమే సహకరించి పూర్తి చేయాల్సి ఉంది. కానీ అలా జరగలేదు. విభజన హాల మేరకు తెలంగాణకు కూడా న్యాయం జరగాలి. ఇలా రెండు రాష్ట్రాలకు విభజన చట్టం అమలు చేయకుండా తప్పుడు ప్రకటనలు ఇస్తోందని కేంద్రం రుజువు చేసుకుంది. పోలవరం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది గోరంత, దీని నిర్మాణానికయ్యే వ్యయం కొండంత అని తేలిపోయింది. ప్రత్యేక హోదా, పన్ను మినహాయింపు, రెవెన్యూ లోటు భర్తీకి పదేళ్ల పాటు పదివేల కోట్లు, వెనుకబడిన ఏడు జిల్లాలకు 30వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజి, పోవలరం కేంద్రమే పూర్తి చేయడం వంటివి నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే.
– ప్రజాతంత్ర డెస్క్