“వాస్తవంగా ఆరోపణలు చేసిన వీరిద్దరూ బలహీన వర్గాల ప్రతినిధులే!పైగా అంబేద్కరిజం ను ,బుద్దిజం సమర్థకులే!! అట్లాంటప్పుడు వీరు క్షుద్ర పూజలు గురించి మాట్లాడడం అనేది అంత సముచితం కానేకాదు.వాళ్ళు క్షుద్రపూజలు విశ్వసిస్తున్నారు అంటే, ఇప్పటివరకు వారు ప్రజల్లో ప్రచారం చేసిన అంబేద్కరిజం,బుద్ధిజం అనేది అవసరం కోసం అనుసరించిన అవకాశవాద బాటలనాలా? రాజకీయ దారిద్ర్యం నెత్తినెత్తుకొని తమ అధినేత కళ్ళలో వెలుగు కోసం చేసిన దుస్సాహసం అనాలా? దానినేమనాలి?”

జాణవులే!నెరజాణవులే!! అని వెనకట ఓ పాత సినిమాలో పాట ఒకటి ఉండేది.ఏ ఎండకు ఆ గొడుగు పట్టే జానపరిభాష మన రాజకీయల్లో సరిహద్దులు దాటి మరీ సంచారం చేస్తున్నట్లు ఉంది. విజ్ఞానం మరీ విస్తరించాలనే ఆ కాలంలో అజ్ఞానం సమాజాన్ని పూర్తిగా ఆవరించి ఉండేది.మూఢత్వం,మూర్ఖత్వం కట్టలు తెగి ప్రవహించేది.ఓ వ్యక్తి లేదా కుటుంబంకు అనుకోని అడ్డంకులు ,అవాంతరాలు ఎదురౌతునప్పుడు, ఆరోగ్యం క్షిణిస్తున్నప్పుడు చెట్టు కాడ,పుట్టకాడ తలఎత్తిన విభేదాలు,తగాదాలను గుర్తు చేసుకొని ,ఇరుగుపొరుగు వారిని అనుమానిస్తూ తమ రుగ్మతకు వారే కారణం అని నిందించే వారు.అంతేకాదు! గ్రామీణ పరిభాష లో చెప్పాలంటే తమ కెవరో”చేతబడి”చేసారని తమలో తాము అనుమానం పడుతూ, అప్పుడప్పుడు సన్నిహితులతో కూడా అనుమానం వ్యక్తం చేస్తూ , దూషిస్తూ ఉండేవారు.నిందా,నిజమా అనేది ప్రక్కన పెడితే!అది ఒకరకమైన మానసిక రుగ్మత ఆవ్యక్తికో, కుటుంబానికో పరిమితం అయి ఉండేది.ఇప్పుడు అలాంటి “చేతబడి” జబ్బు నే, ఆధునిక రాజకీయాలకు సోకింది?
వ్యక్తికి ఉండాల్సిన మానసిక వైకల్యం వ్యవస్థకు సోకితే ఎలా ఉంటుంది?చూసే వాడికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది.అచ్చం అలాగే మన” చేతబడి “అనబడే పదం కాస్తా నాగరీకరించబడి “క్షుద్ర విద్య”గా నవీకరించబడింది.తమ మానసిక విచలితత్వానికి కారణాలు వెతుక్కోకుండా ఇరుగుపొరుగు ను అనుమానించి ఆడి పోసుకోవడం ఆనవాయితీ!తన జబ్బుకు తనలోని వైఫల్యానికి పొందాల్సిన చికిత్సలకు బదులు కాస్తా బలం ఉన్న వాళ్ళయితే అనుమానం ఉన్న వారిపై విరుచుకు పడడం,అవసరం అయితే తమ జబ్బులకు వారే అని బహిరంగంగా నిందించడం, దాడులు చేయడం,అవసరం అయితే నిమ్మకాయలు,పసుపు,కుంకుమ,బొగ్గు
వాస్తవానికి రాజకీయ నాయకులు చట్టసభలలో ప్రమాణాలు, సభ్యులుగా,మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేసే సందర్భంలో ప్రజలతో”హేతు బద్దం”గా వ్యవహరిస్తామని ప్రమాణం చేస్తారు.హేతుబద్దత అంటే ఎలాంటి మూఢనమ్మకాలకు,అపనమ్మకాలకు తావులేకుండా నిజాయితీ గా,లేదా పారదర్శకంగా అని అర్థం.మరి అలాంటి ప్రమాణాలు కూడా గాలికి వదిలి రాజకీయాలు “క్షుద్రం”స్థాయికి దిగజార్చడంలో ఆంతర్యం అంతరార్థం కాని బ్రహ్మ పదార్థం ఏమీకాదు?ఒకరకంగా అది అసహనం నుండి పుట్టుకొస్తున్న అవకాశవాదం,అపసవ్యదోరణి,అశాస్త్
ఈ క్షుద్ర పూజలు అనే అంశం 1990 దశకంలో స్వర్గీయ యన్టీఆర్ అధికారం లో ఉండగా ఎక్కడో నాచారం స్డుడియోలోకమండలం,కషాయం ధరించి ,కుండలాలు దరించి శవపూజ అనబడే క్షుద్రపూజలు చేశారని అప్పటి సంచలనాత్మక పత్రిక ఎన్కౌంటర్ లో పింగళి దశదరామ్ లాంటి వారు ఆరోపించారు.ఆయన ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఎన్టీఆర్ ఆహార్యం కూడా అలాగే కనిపించేది..అటు తర్వాత రాజకీయాలు క్షుద్రం అవుతున్నప్పటికీ క్షుద్ర పూజలు అనే మాట వినపడలేదు,, అయితే,హేతుబద్ధ ప్రమాణాలు ప్రక్కన పెట్టండి,అధికార కార్యక్రమాలలో కూడా పూజలు,పురస్కారాలు మామూలు అంశమే!
తెలంగాణా రాష్ట్రం రాజకీయాలలోనే తాజాగా ఈ అంశం బహిర్గతం అయ్యింది.భువనగిరి జిల్లా పర్యటనలో ఉండగా తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుడిపై ప్రమాణం చేసి రుణమాఫీ అమలు చేస్తామని మాటిచ్చారు.రేవంత్ రెడ్డి దేవుడిని నమ్ముతాడు కనుక తాను చెప్పేది బలమైన మాట!ఉత్తుత్తి వాగ్దానం కాదని చెప్పడానికే ఆయన మాట్లాడారు.అందులో తప్పు లేదు.కానీ, అన్న ప్రకారం రుణమాఫీ చేసినప్పటికీ ఇంకా కొంత శాతం రైతులకు వివిధ కారణాలతో రుణమాఫీ కాలేదు.ఈ సందర్భంగా రేవంత్ మాటనే త్రిప్పి కొడుతూ ప్రతి పక్షం నేత హరీష్ రావు “ప్రాయశ్చిత్త పూజ “జరిపిస్తామన్నారు.అన్నమాట ప్రకారం ఆయన పూజ జరిపించడం ప్రత్యార్థుల కేసుల వరకు వెళ్ళడం జరిగింది.ఒక రకంగా ప్రజలు కూడా నోరులేని దేవుళ్ళు అని భావించ బట్టే అధికార, ప్రతిపక్ష నాయకులు ఈ అధునాతన క్రీడను ఆడుతున్నారా?. అదికార,ప్రతిపక్ష నాయకుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు నిత్య సహజ ప్రక్రియ నే!కానీ, తాజాగా ఆ మాటలు కాస్తా బరితెగించి బజారు కెక్కాయి.ఇటీవల హరీష్ రావు తమిళ నాడు లోని క్షుద్ర దేవాలయాలు సందర్శించి, తెలంగాణా లో యల్నినో ప్రభావం పెరిగి,ప్రజలు ఇబ్బందులు పడాలని క్షుద్రపూజలు చేయించిన సమాచారం తమ దగ్గర ఉందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,మరో శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్ ఆరోపణ చేశారు.దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటవరసకు సమర్థించడం కూడా అంత మంచిది కాదు?
వాస్తవంగా ఆరోపణలు చేసిన వీరిద్దరూ బలహీన వర్గాల ప్రతినిధులే!పైగా అంబేద్కరిజం ను ,బుద్దిజం సమర్థకులే!! అట్లాంటప్పుడు వీరు క్షుద్ర పూజలు గురించి మాట్లాడడం అనేది అంత సముచితం కానేకాదు.వాళ్ళు క్షుద్రపూజలు విశ్వసిస్తున్నారు అంటే, ఇప్పటివరకు వారు ప్రజల్లో ప్రచారం చేసిన అంబేద్కరిజం,బుద్ధిజం అనేది అవసరం కోసం అనుసరించిన అవకాశవాద బాటలనాలా? రాజకీయ దారిద్ర్యం నెత్తినెత్తుకొని తమ అధినేత కళ్ళలో వెలుగు కోసం చేసిన దుస్సాహసం అనాలా? దానినేమనాలి? ఇంకా దక్షిణ భారతదేశ జనాలను రాక్షసులని,అక్కడ ఉన్న దేవాలయాలను క్షుద్ర దేవాలయాలు అని,అక్కడ జరిగే పూజలు క్షుద్రపూజలు అని సనాతన ధర్మం పేరుతో చేస్తున్న కుట్రలను పరోక్షంగా ఈ నేతలు సమర్థిస్తున్నట్లా?ఏది ఏమైనా రాజకీయాలు బలహీనంగా, అపహాస్యం గా మారిపోయాయని కాక్రోచ్ నేత అబిజీత్ దీప్కే చేసిన వ్యాఖ్యలలో ఏమైనా తప్పు ఉన్నదా? లేదుకదా? రాజకీయాలు కోసం దక్షిణ భారతదేశం గుడులు క్షుద్ర ఆధారాలుగా,అక్కడ చేసే పూజలు క్షుద్రపూజలు గా మాట్లాడడం అంటే మన ప్రజలు, మన శ్రామిక సంస్కృతి ని మనమే అవమానించడం కాదా!?
అసలు హేతుబద్దత లేని పూజలు ,పునస్కారాలు గురించి రాజకీయాల్లో మాట్లాడడమే తప్పు! అలాంటిది స్వప్రయోజనాల కోసం రాజకీయాలను క్షుద్ర పూజల స్థాయి కి దిగజార్చుకోవడం అంతకన్నా ప్రమాదం,హీనం?ప్రజల బలహీనత పై ఆటలు కాకపోతే వీటినేమంటారు?వర్షాల కోసం చేసే వరుణయాగాలు శాస్థ్రియం ఎంతమాత్రం కాదు…ప్రకృతి విపత్తులను రాజకీయ పరిభాష కు పదాలు,అర్థాలు వెతుక్కోవడం లో చిత్తశుద్ధి లేదు.వీటిలో నైతికత మాత్రమే కాదు,ఎలాంటి హేతుబద్దత లేదు..!ఇవి దేనికి సంకేతం, ప్రకృతి పరిణామాలు కూడా తమ రాజకీయ పరిభాష కు ఆభరణాలుగా వాడుకునే దుర్బలత్వం మన నేతలకు ఎందుకు వచ్చింది? ఇలాంటి జవాబు లేని ప్రశ్నలు ఎంతో కాలం ముందు నుండే కదలాడుతున్నాయి..ఈ రాజకీయ “క్షుద్ర”పూజలైనా! వరుణపూజలైన ప్రజల్ని మభ్య పెట్టడానికి రాజకీయ పక్షాలు చేస్తున్న రభస తప్ప అందులోప్రజలకు ఎలాంటి ప్రయోజనం కానీ,ఒనగూడే లబ్దిని ఏమీలేదు?.





