విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహ

‘‘‌లక్షలాది మంది వాలంటీర్లు సమాజ సేవలో భాగ స్వాములు అవుతున్నారు. ప్రతిఫలం ఆశించకుండా సేవా మార్గం పట్టేవారే వలంటీర్లుగా చేరతారు. మొక్కల పెంపకం, పారిశుద్ధ్యం, రక్తదాన శిబిరాలు, అక్షరాస్యత వంటి కార్యక్రమాల్లో విద్యార్థినీ విద్యార్థులు స్వచ్ఛం దంగా పాల్గొంటున్నారు. సామాజిక కార్యక్రమాల అమలులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఒకనాడు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.’’

నేడు ఎన్‌ఎస్‌ఎస్‌ ‌దినోత్సవం

విద్యార్థుల ప్రప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసం. కానీ భావి భారతాన్ని నిర్ణయించ వలసినది యువకులే. ప్రతి దేశ పురోభివృద్ధి లోనూ, ఉద్యమాల లోనూ విద్యార్థులు పాలు పంచు కుంటారు. ఒక్కొక్కసారి ఆవేశం ఎక్కువ కావచ్చు కానీ కల్లాకపటం ఎరగని నిర్మల, సున్నిత మనస్కులు విద్యార్థులు. వారు కూడా సంఘజీ వులే, సంఘంలో భాగస్వాములే, సంఘసేవ (•శీ•ఱ•శ్రీ •వతీఙఱ•వ) వారికీ సామాజిక బాధ్యతగా ఉంది. విద్యాభ్యాసానికి ఆటంకాలు లేకుండా సంఘసేవ చేసే అవకాశాలను ప్రభు త్వాలు కల్పిస్తున్నాయి. విద్యను ఆర్జించే వయసులోనే యువతీ యువకులలో సేవాభావం, దేశభక్తి, సామాజిక స్పృహ ను కలిగించేందుకు ‘జాతీయ సేవా పథకం’ (ఎన్‌ఎస్‌ఎస్‌) ‌ప్రారం భమైంది. నిరుపేదల కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ, సమాజ సేవ చేసే లక్ష్యంతో జాతిపిత మహాత్మా గాంధీ శత జయంతి సందర్భంగా 1969 సెప్టెంబర్‌ 24‌వ తేదీన ఈ పథకాన్ని దేశ వ్యాప్తంగా మొదలు పెట్టారు.

అప్పటి ‘’విశ్వ విద్యాలయాల నిధుల సంఘం’’ (యూజీసీ) చైర్మన్‌ ‌రాధాకృష్ణన్‌ ‌జాతీయ సేవా పథకాన్ని విద్యా సంస్థలలో ప్రారంభించాలని సూచించారు. 1959 జనవరిలో జరిగిన సీఏబీఈ పాలక మండలి ఆయన సూచనకు ఆమోదం తెలిపింది. 1952లో పంచవర్ష ప్రణాళికలో ప్రతిపాదించబడి, 4వ పంచవర్ష ప్రణాళికలో ప్లానింగ్‌ ‌కమిషనర్‌ ‌ద్వారా 5కోట్ల రూపాయలను ఎన్‌ఎస్‌ఎస్‌ ‌పథకానికి కేటా యించారు.1958లో అప్పటి ప్రధాన మంత్రి పండిట్‌ ‌నెహ్రూ దేశంలోని ముఖ్య మంత్రులకు జాతీయ సేవా పథకాన్ని అమలు చేయాలంటూ లేఖలు రాశారు. ఈ పథకానికి తగిన వ్యూహ రచన చేయాలని కూడా ఆయన కేంద్ర విద్యా శాఖను ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 37 విశ్వ విద్యాలయాలలో సుమారు 40,000 మంది వాలంటీర్లతో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి వి.కె.ఆర్‌.‌రావు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 1999 నాటికి ఈ పథకంలో 13,52,000 మంది వాలంటీర్లు ఉన్నారు. 176 విశ్వ విద్యాలయాల పరిధిలో లక్షలాది మంది విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్‌ ‌సేవల ందిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్‌ఎస్‌ఎస్‌ ‌యూనిట్లను కళాశాల స్థాయిలో ప్రారంభించారు. లక్షలాది మంది వాలంటీర్లు సమాజ సేవలో భాగస్వాములు అవుతున్నారు. ప్రతిఫలం ఆశించకుండా సేవా మార్గం పట్టేవారే వలంటీర్లుగా చేరతారు. మొక్కల పెంపకం, పారిశుద్ధ్యం, రక్తదాన శిబిరాలు, అక్షరాస్యత వంటి కార్యక్రమాల్లో విద్యార్థినీ విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. సామాజిక కార్యక్రమాల అమలులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఒకనాడు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.

ఒకవైపు విద్యా వ్యాసంగాన్ని కొనసా గిస్తూనే, మరోవైపు సంఘసేవకు విద్యార్థులను సమాయాత్త పరచేదే జాతీయ సేవా పథకం. సామాజిక కార్యక్రమాలపై యువతకు తర్ఫీదు నివ్వడమే గాక, వారి సేవలను వినియోగించు కోవడం ఎన్‌ఎస్‌ఎస్‌లో కనిపిస్తుంది. కళాశాల స్థాయిలో ఎన్‌ఎస్‌ఎస్‌ ‌విభాగాలకు ప్రిన్సిపాల్‌ ‌పర్యవేక్షకుడిగా, ఒక అధ్యాపకుడు ప్రోగ్రాం అధికారిగా వ్యవహరిస్తారు. సమాజ సేవ పట్ల ఆసక్తి చూపే విద్యార్థులను ఇందులో చేర్చుకుంటూ, ప్రతి వందమంది విద్యార్థులను ఒక యూనిట్గా ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూంటారు. రెండు విద్యా సంవత్సరాలలో కనీసం 240 గంటలు సంఘసేవలో పాల్గొనేలా కృషి జరుగుతోంది. భావితరాలకు వారసులైన విద్యార్థులు జట్లుగా పనిచేస్తూ ఐక్యతా భావాన్ని పంచు కుంటారు. సమాజంలో విద్యార్థి తన స్థానాన్ని, గమ్యాన్ని నిర్ణయించు కొనేలా చేయడం ఇందులోని ప్రధాన అంశం. విద్యార్థులు చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో సామాజిక సేవలో పాల్గొనేలా చేయడమే జాతీయ సేవా పథకం ప్రధాన ధ్వేయం.

కళాశాల ప్రిన్సిపాల్‌ ‌నిర్ణయించిన ప్రకారం సమీప ప్రదేశాల్లో ఆలయాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ, గ్రామీణ ప్రాంతాలలో అపరిశుభ్రతను తొలగించడం, మంచినీటి సౌకర్యాల మెరుగుదలకు శ్రమదానం, పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు ఎన్‌ఎస్‌ఎస్‌ ‌శిబిరాలలో నిర్వహి స్తుంటారు. ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడి వసతులను గ్రామస్తుల సహకారంతో మెరుగు పరచేందుకు విద్యార్థులు కృషి చేస్తారు. రక్తదానం, ఉత్సవాలలో స్వచ్ఛంద సేవ, అతివృష్టి, అనావృష్టి, వరదలు, తుఫానులు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభ వించి నపుడు విరాళాలు సేకరించి తగు సహాయ సహకారాలను అందించడం కూడా ఎన్‌ఎస్‌ఎస్‌ ‌సేవా కార్యక్రమాలుగా ఉన్నాయి. అక్షరాస్యతా కార్యక్రమాల అమలులో భాగస్వాములు కావడం, ఆరోగ్య సూత్రాలను బోధించడం, ఎయిడ్స్ ‌వంటి ప్రాణాంతక వ్యాధులపై ప్రజలను చైతన్య పరచడం వంటి కార్యక్రమాల్లోనూ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొంటారు.

ఎన్‌ఎస్‌ఎస్‌ ‌వాలంటీర్ల సేవలకు గుర్తిం పుగా విశ్వ విద్యాలయాలు ధ్రువీకరణ పత్రాలను అంద జేస్తాయి. ఉద్యోగ నియామకాలు, ఇతర సందర్భాల్లో ఈ సర్టిఫికెట్‌ ‌లకు విలువ ఉంటుంది. ఆర్మీ, ఎయిర్‌ ‌ఫోర్సు, మిలటరీ, నర్సింగ్‌ ‌సర్వీసులలో, పోలీసు, టెలికాం, సమాచార వ్యవస్థ తదితర విభాగాల్లో నియా మకాల సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ ‌సర్టిఫికెట్లు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ‘నా కోసం కాదు, నీ కోసమే..’ అనే దీక్షా నినాదంతో- సేవలు అందించడమే ఎన్‌ఎస్‌ఎస్‌ ‌వాలంటీర్ల లక్ష్యం. యువతలో సామాజిక స్పృహను కల్పిస్తూ, వారిని సేవా భావంతో ముందుకు నడిపించడం నిరంతర కార్యక్రమంగా కొనసాగాలి. ఈ లక్ష్యంతో ఏర్పాటైన జాతీయ సేవా పథకం ఎంతోమంది విద్యార్థులను ఆకర్షిస్తోంది. ఈ పథకంలో చేరిన వారు క్రమశిక్షణ, సామాజిక చైతన్యం కలిగి జీవితంలో ముందుకు రాణించే అవకాశం ఉంది.
– రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page