వరంగల్‌ ‌రైతు సంఘర్షణ సభ విజయవంతం

 రైతులలో, ప్రజల్లో భరోసా నింపిన రాహుల్‌

‌వరంగల్‌/‌సుబేదారి, ప్రజాతంత్ర , మే 6  : తెలంగాణ పిసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన మొట్టమొదటి భారీ బహిరంగ సభ శుక్రవారం రాత్రి హనుమకొండ ఆర్టస్ అం‌డ్‌ ‌సైన్స్ ‌కళాశాల మైదానంలో వరంగల్‌ ‌రైతు సంఘర్షణ సభ విజయవంతమైంది. సభకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌ ‌గాంధీ పాల్గొన్నారు. ఈ సభకు తెలంగాణ రాష్ట్రం నుండి అన్ని జిల్లాల నుండి, గ్రామాల నుండి, పల్లెల నుండి, సద్ది కట్టుకొని, నీళ్ల సీసా చేతిలో పట్టుకొని, పైనమైన రైతులు, కాంగ్రెస్‌ ‌పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున వరంగల్‌కు దారి తీశారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై రైతులకు భరోసా ఇవ్వడానికి ఏఐసిసి ఆదేశాల మేరకు, తెలంగాణ పిసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ రైతు సంఘర్షణ సభ యావత్‌ ‌తెలంగాణ ప్రజానీకాన్ని, రైతులను, నిరుద్యోగులను, యువతీ యువకులకు ఒక భరోసా ఇవ్వడమే ఈ సభ విజయవంతమైందని చెప్పవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రజలు తరలిరావడం సభ ప్రాంగణం పూర్తిగా నిండి పోయింది. 25 ఎకరాలలో ఏర్పాటు చేసిన భారీ సమావేశానికి ప్రజలు రైతులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ వ్యతిరేక విధానం ప్రజలలో ఏ మేరకు కట్టలు తెంచుకుంటుంది అర్థమవుతుంది. దారులన్నీ వరంగల్‌ ‌వైపు అన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ సమావేశంలో మాట్లాడిన రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి నాయకులు 2023-24లో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ వంద సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతుందని తెలంగాణ కాంగ్రెస్‌ ఇం‌చార్జ్ ‌మాణిక్యం ఠాగూర్‌, ‌తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి, మాట్లాడుతూ రానున్నది తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వమేనని రాష్ట్రం ఇచ్చిన తర్వాత తెలంగాణలో రైతులు ప్రజలు, విద్యార్థులు యువత యువకులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విడనాడి కేవలం కుటుంబం దోచుకోవడానికి పరిపాలనను కొనసాగిస్తున్నారని, టిఆర్‌ఎస్‌ ‌నాయకులు రాష్ట్రంలో భూ భక్తులతో కబ్జాలకు పెద్ద ఎత్తున ప్రదేశాలని ఎక్కడ భూమి కనపడ్డ దాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, వరంగల్‌ ‌చుట్టుపట్ల రైతుల వద్ద నుంచి భూములు లాక్కోవడానికి కుట్ర జరుగుతుందని రైతులకు ఒకటే భరోసా ఇస్తున్న తెలంగాణ రాష్ట్రంలో దగాపడ్డ రైతులకు కాంగ్రెస్‌ ‌పార్టీ అండగా ఉంటుందన్నారు.

వరంగల్‌ ‌లో రైతులు ఎక్కడ భూములు వదులుకోవద్దు అని ప్రభుత్వం ల్యాండ్‌ ‌పూలింగ్‌ ‌పేరుతో అక్రమ భూ ఆక్రమణ చేసి రియల్‌ ఎస్టేట్‌ ‌దందా లకు తెర తీసే అవకాశం ఉందని ఇదంతా రైతులు తిప్పికొట్టాలని అన్నారు. ప్రభుత్వమే రియల్‌ ఎస్టేట్‌ ‌దందా చేస్తే ప్రజలు ఎక్కడ ఉంటారన్నారు. వ్యవసాయ భూములు ఎక్కడ ఉంటాయి అన్న ప్రశ్నలు ప్రభుత్వానికి వేశారు. రైతుల వద్ద నుంచి భూములు రైతుల వద్ద నుండి భూములు లాక్కోవడం టిఆర్‌ఎస్‌ ‌నాయకులు చేపడుతున్న దుర్మార్గపు కార్యక్రమం అని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రైతుల పరిస్థితి అద్వానంగా ఉందని పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పెట్టిన పెట్టుబడి లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఇప్పటికే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని వారు ఆరోపించారు, గతంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రైతులకు ఇచ్చిన సబ్సిడీలను అన్నింటిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొలగించినట్లు, దీని ద్వారా రైతులు కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్న చందంగా వృద్ధుల పరిస్థితి మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తాం అని మాట ఇచ్చిన కేసీఆర్‌ ఇప్పటి వరకు ఆమె నిలబెట్టుకోలేదని రేపు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడగానే రైతుల రుణమాఫీ మొత్తం మాఫీ చేస్తామని ఇది కూడా ఏక మొత్తంలో మాఫీ చేస్తామని అన్నారు.

ప్రభుత్వ హయాంలో పంట నష్టపోయిన రైతులందరికీ పంట నష్టపరిహారం వచ్చేదని అని తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం ఒక్క పైసా కూడా చెల్లించలేదని , అకాల వర్షాలకు, వడగండ్ల వాన, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చేది, కానీ నేడు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పంట నష్టపరిహారం పూర్తిగా ఎత్తి వేసిందని అన్నారు. రైతులకు పంట గిట్టుబాటు ధర రుణమాఫీ చేపడతామని పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ‌ముఖ్య నేతలు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, మధుయాష్కి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, సీతక్క, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, ‌సిరిసిల్ల రాజయ్య, హన్మకొండ వరంగల్‌ ‌జిల్లాల కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి,  నరేందర్‌ ‌రెడ్డి యూత్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షులు, తదితర కాంగ్రెస్‌ ‌నాయకులు, కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్య నేతలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *