– నిరుపేదల కష్టాలు తెలిసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్
– ప్రభుత్వ చౌక ధరల దుకాణంలో నిరుపేదలకి సన్న బియ్యం పంపిణీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
– తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పక్క మహేశ్వర నియోజకవర్గంలో మీ సబితమ్మ పక్క
కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 15 :
మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం బంజరుగడ్డ తాండ,దావుద్ గుడా తండా,పెద్దమ్మ తండా,పులిమామిడి,చిప్పలపల్లి,మురళీనగర్,జైత్వారం, కొత్తగూడ గ్రామాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ,అడుగడుగున జననీరాజనంతో ఘన స్వాగతం పలికారు. భారీగా హాజరైన తండావాసులు,పలు గ్రామాల ప్రజలు.మేమంతా మీతోనే మీకు అండగా ఉంటామని ముక్తకంఠంతో స్వాగతం పలికారు.మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే అది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంతోనే అన్ని రంగాలను అభివృద్ధి పరచుకుంటూ ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ని మరొకసారి ఆశీర్వదించి ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి చేయాలని ఆమె ప్రజలను కోరారు.మహేశ్వరం నియోజకవర్గం గడిచిన నాలుగున్నర సంవత్సరాల కిందట ఎట్లా ఉండే ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా ఉందని అన్నారు.అభివృద్ధి చేశాను మరింత అభివృద్ధి కోసం మీకుటుంభ సభ్యురాలిగా తననును ఆశీర్వదించి మరొకసారి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తున్నామని మరింత అభివృద్ధి కోసం మరొకసారి బిఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి దీవించవలసిందిగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కందుకూరు మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,నాయకులు, ప్రజాప్రతినిధులు,మహిళా నాయకురాలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.