రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం

  • రాహుల్‌ ‌సభకు అనుమతి ఎందుకు ఇవ్వరు
  • వి•రైతే ఎక్కడపడితే అక్కడ ధర్నాలు చేయొచ్చు
  • కాంగ్రెస్‌ అం‌టే టిఆర్‌ఎస్‌కు వణుకు పుడుతుంది
  • అరెస్ట్‌లపై మండిపడ్డ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ‌మండిపాటు
  • తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పైనే కక్ష సాధింపా..? : టిఆర్‌ఎస్‌ ‌తీరుపై మండిపడ్డ షబ్బీర్‌ అలీ

హైదరాబాద్‌/‌కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 2 : రాష్ట్రంలో రజకార్ల రాజ్యంనడుస్తుందని.. కాంగ్రెస్‌ను చూస్తే టిఆర్‌ఎస్‌లో వణుకుపుడుతుందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ‌కుమార్‌ అన్నారు. దర్నాలు, ఆందోళనలు కేవలం అధికార టిఆర్‌ఎస్‌ ‌మాత్రమే చేయాలన్న ధోరణిలో ఉన్నారని మండిపడ్డారు. ఇందుకు పోలీసులు కూడా దోహదంచేయడం దారుణమని అన్నారు. ఓయూలో రాహుల్‌ ‌సభకు అనుమతి నిరాకరించడం, విద్యార్థి నాయకులను అరెస్ట్ ‌చేయడం, పరామర్శించడానికి వెళ్లిన టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం అంతా రజాకార్ల రాజ్యానికి నిదర్శనమని అన్నారు. ఎఐసిసి నేత రాహుల్‌ ‌గాంధీ ఈ నెల 6, 7 వ తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ ఓయూలో పర్యటిస్తారని తెలంగాణ కాంగ్రెస్‌ ‌నేతలు ప్రకటించారు. దీనికి ఓయూ వీసీ, ప్రభుత్వం అనుమతి ఇంకా ఇవ్వలేదు. ఈ క్రమంలో అనుమతివ్వాలంటూ.. ఓయూ విద్యార్థులంతా మినిస్టర్స్ ‌క్వార్టర్స్‌ను ముట్టడించి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఓయూ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ ‌చేశారు. దీంతో అరెస్టయిన విద్యార్థులను పరామర్శించడానికి వెళ్లిన వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డిని కూడా సెక్షన్‌ 151 ‌కింద పోలీసులు అరెస్ట్ ‌చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఓయూలోని అడ్మినిస్ట్రేషన్‌ ‌బిల్డింగ్‌ను ముట్టడించేందుకు వెళ్లిన ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ ‌చేసి బంజారా హిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. అయితే అరెస్టయిన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ ‌చేశారు. దీంతో జగ్గారెడ్డి అరెస్ట్‌పై జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ‌కుమార్‌ ‌తీవ్రంగా స్పందించారు. ప్రశ్నించే గొంతుకలు విశ్వవిద్యాలయాలని ఆయన అన్నారు. ఓయూకు రాహుల్‌ ‌వొచ్చేలా అనుమతి ఇవ్వాలని విద్యార్థులు నిరసన తెలపడానికి వెళ్లితే వారిని అరెస్ట్ ‌చేసి పోలీస్‌ ‌స్టేషన్‌ ‌తరలించారన్నారు. రాష్ట్రంలో నిర్బంధ వాతావరణం వుందని, జగ్గారెడ్డి అరెస్ట్‌ను ఖండిస్తున్నామన్నారు. రాహుల్‌ ‌సభ అంటేనే టిఆర్‌ఎస్‌ ఎం‌దుకు వణుకుతుందని అన్నారు.

గతంలో చాలా మంది నేతలు వి•టింగ్‌లు పెట్టారని, రాహుల్‌.. ‌నిషేదిత సంస్థకు చెందిన నాయకుడు కాదు కదా.. మరెందుకు భయం.. ఆయన ఓయూకు వొస్తానంటే వి•కేందుకు భయం అని శ్రవణ్‌ ‌ప్రశ్నించారు. రాహుల్‌ ఓయూకు వొస్తే.. జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందని టీఆర్‌ఎస్‌ ‌నేతల ఆందోళన అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్టస్ ‌కాలేజీ బయట కూర్చుంద్దాం రండీ.. వి• బండారం బయటపెట్టకపోతే మేము బట్టలు విప్పుకొని వొస్తాం.. హరీష్‌ ‌రావు, కేటీఆర్‌లకు దమ్ముందా? ఆయన సవాల్‌ ‌విసిరారు. జగ్గారెడ్డి అరెస్ట్‌పై కాంగ్రెస్‌ ‌శ్రేణులు మండిపడుతున్నాయి. అరెస్టైన వారిని పరామర్శించడానికి పోతే.. అరెస్టులు చేస్తారా అంటూ.. కాంగ్రెస్‌ ‌నేతలు మండిపడుతున్నారు. యూనివర్సిటీకి రాహుల్‌ ‌గాంధీ తప్పకుండా వెళ్తారని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమంలో విద్యార్ధుల పాత్ర కీలకమని, ఉస్మానియా యూనివర్సిటీ కేసీఆర్‌ ‌నా జాగీరు అనుకుంటున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితి లేదన్నారు. రాహుల్‌ ‌గాంధీ 7 తేదీన ఓయూకి వెళ్తారన్నారు. ఓ సామాన్య ఎంపీగా.. సామాన్యుడిగా వెళ్తారని ఆయన తెలిపారు. అరెస్టు అయిన విద్యార్థులను పరామర్శించడానికి అక్కడికి వెళ్ళిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బంజారా హిల్స్ ‌పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

పరామర్శ చేయడం కూడా నేరం అయినట్టుగా పోలీసులు వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. రాజ్యాంగం ద్వారా సంకల్పించిన వాక్‌ ‌స్వాతంత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం హరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల రక్షణ కోసం పని చేయాల్సిన పోలీసులు పాలకుల మెప్పు కోసం పని చేస్తున్నారని విమర్శించారు. జగ్గారెడ్డిని అప్రజాస్వామికంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రకారంగా ఓయు విద్యార్థులు చేసిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అడ్డుకోవడం తగదన్నారు. అరెస్టు చేసిన విద్యార్థులకు, జగ్గారెడ్డికి బేషరతుగా క్షమాపణ చెప్పి తక్షణమే విడుదల చేయాలని పోలీసులను డిమాండ్‌ ‌చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలను చూసి చలించిపోయిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అమరవీరుల ఆశయాలు నెరవేర్చడానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందన్నారు. దశాబ్దాల కలను నెరవేర్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతా భావంతో ఉండాలన్న విషయాన్ని విస్మరించి సోనియా తనయుడు రాహుల్‌ ‌గాంధీ ఓయూలో పర్యటించడానికి అనుమతి ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కుటుంబానికి టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఇచ్చే మర్యాద ఇదేనా అని ప్రశ్నించారు. ఓయులో నిర్వహించే రాహుల్‌ ‌గాంధీ పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుందని వెల్లడించారు.

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పైనే కక్ష సాధింపా..? : టిఆర్‌ఎస్‌ ‌తీరుపై మండిపడ్డ షబ్బీర్‌ అలీ
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌ ‌పార్టీపై టిఆర్‌ఎస్‌ ‌నేతలు అనసవరంగా నోరు పారేసుకుంటున్నారని, రాహుల్‌ ‌సభకు అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌నేత షబ్బీర్‌ అలీ మండిపడ్డారు. రాహుల్‌ ‌గాంధీ ఓయూకు వొస్తానంటే సీఎం కేసీఆర్‌ ఎం‌దుకు భయపడుతున్నారని నిలదీశారు. తెలంగాణ ఇచ్చిన నాయకుడిని ఇంత దుర్మార్గంగా అడ్డుకోవడం ఎందుకని మండిపడ్డారు. కేసీఆర్‌ ‌కుటుంబం అనుభవిస్తున్న పదవులన్నీ కాంగ్రెస్‌ ‌పార్టీ, రాహుల్‌, ‌సోనియా గాంధీ పెట్టిన భిక్షేనని విమర్శించారు. సోమవారంనాడిక్కడ ఆయన ఆర్‌ఎన్‌ఎ ‌ప్రతినిధితో మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ ‌వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. అమరవీరుల ఆత్మ క్షోభిస్తోందని అన్నారు. ఓయూలో రాహుల్‌ ‌పర్యటనకు అనుమతినివ్వాలని డిమాండ్‌ ‌చేశారు. ఎన్‌ఎస్‌యూఐ నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నట్లు కాంగ్రెస్‌ ‌నేత తెలిపారు. వరంగల్‌లో ఈ నెల 6న రైతు ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఈ సభకు ప్రతి రైతు కుటుంబం నుంచి ఒక్క రైతు అయినా కదిలి రావాలని కోరారు. పంటలకు గిట్టుబాటు ధర రావాలన్నా, రైతులకు మేలు జరగాలన్నా వరంగల్‌ ‌సభకు పెద్ద ఎత్తున కదిలిరావాలని పిలుపునిచ్చారు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే కార్యాచరణను కాంగ్రెస్‌ ‌తీసుకుందని చెప్పారు. ఎక్కడ ఏ సమస్య వొచ్చినా సమయస్ఫూర్తితో పరిష్కరించే నాయకులు కాంగ్రెస్‌లో ఉన్నారని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ‌తన ఎనిమిదేళ్ల పాలనలో పోరాట సంస్కృతిని ధ్వంసం చేసి దోపిడీ సంస్కృతిని సృష్టించిందని ధ్వజమెత్తారు. యాసంగిలో వరి వేయవద్దని సీఎం కేసీఆర్‌ ‌చెప్పారని, ప్రత్యామ్నాయ పంటలు వేస్తే కొనే దిక్కు లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతుందని చెప్పారు. అకాల వర్షాలతో సిద్దిపేట, సిరిసిల్ల ప్రాంతాల్లో తడిసిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. కాంగ్రెస్‌ ‌పునర్‌ ‌వైభవానికి వరంగల్‌ ‌సభ తొలిమెట్టు కానుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page