పగ ప్రతీకారాలతో విపక్షాలపై కేసులు
కెసిఆర్ మళ్లీ వొస్తేనే ప్రజలకు విముక్తి
దుబ్బాకలో స్థానిక ప్రతినిధుల సన్మానంలో మాజీ మంత్రి హరీష్ రావు
మెదక్, ప్రజాతంత్ర, జూలై 3 : రాష్ట్రంలో పరిపాలనను గాలికి వదిలేశారు.. ప్రతీకారం, పగవి•ద దృష్టి పెట్టారని కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. ఏడు నెలల్లోనే పల్లెలు మురికి కూపాలుగా మారాయి. ఒక్క రూపాయి కూడా గ్రామపంచాయతీలకు ఇవ్వలేదు. ఏడు నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు లేవు. నిధులు లేక గ్రామపంచాయతీలు ఆగమాగం అవుతున్నాయి. స్కూళ్లల్లో మిడ్ డే వి•ల్స్ కార్మికులకు జీతాలు లేవు. కరెంట్ బిల్లు కట్టలేదని ఓ స్కూల్‌కు కరెంట్ చేశారు. పాలనను గాలికి వదిలేశారు. ఎక్కడా చూసిన ఆత్మహత్యలు, హత్యలు, మానభంగాలు జరుగుతున్నాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. రైతుబంధుకు దిక్కు లేదు.. ఖమ్మం జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో మరో రైతు పురుగుల మందు తాగేందుకు యత్నించాడు.
పరిపాలను గాలికి వదిలేసి కేవలం ప్రతిపక్షాల వి•ద కేసులు పెట్టడం పనిగా పెట్టుకున్నారు. శాంతి భద్రతలు ఆగమయ్యాయి. రైతుబంధుకు దిక్కు లేదు. జులై వచ్చినా ఒక్క రూపాయి ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకుంటున్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జూన్ నెలలోనే రైతుబంధు ఇచ్చేవాళ్లం. రైతుబంధు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇప్పటికి చాలా చోట్ల వరి నాట్లు పడలేదు. కేవలం మూడు శాతం మాత్రమే వరి నాట్లు పడ్డాయని హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్ 200 పెన్షన్‌ను రూ. 2 వేలు చేసి ఇచ్చిండు. కాంగ్రెసోళ్లు పెన్షన్ల కింద రూ. నాలుగు వేలు ఇస్తమన్నరు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇంటికి రెండు పెన్షన్లు అన్నారు అతీగతీ లేదు.
మే, జూన్ నెల పెన్షన్లు బాకీ పడ్డారు. ఏప్రిల్ నెల పెన్షన్ జూన్ 25కు ఇచ్చారు. కల్యాణలక్ష్మి చెక్కులు ఏడు నెలల నుంచి రావట్లేదు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ బంద్ అయ్యాయి. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు రో•-లడెక్కారు. ఎవర్నీ ఉద్దరించారు వి•రు. పరిపాలనను గాలికి వదిలేశారు.. కేవలం ప్రతీకారం, పగ వి•ద దృష్టి పెట్టారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు ఊరుకోరు.. ఎన్నికలు రాక తప్పదు.. మళ్లీ కేసీఆర్‌ను గెలిపించుకుంటారు. అందరూ ధైర్యంగా ఉండండి. తప్పకుండా అందరికీ భవిష్యత్ ఉంటది. కార్యకర్తలు అధైర్యపడొద్దు మనకు మంచి రోజులు వస్తాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పకుండా వస్తది. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.