మున్నేరుపై సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం

– పెండింగ్ బిల్లులు, అప్రోచ్ రోడ్ల చిక్కులతో నిలిచిన పనులు
– రెండున్నరేళ్లు దాటినా పూర్తికాని వైనం
– సంక్రాంతికైనా మోక్షం ల‌భించేనా?

ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: ఖమ్మం నగ రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ.. ఖమ్మం-పాలేరు నియోజకవర్గాలకు ప్రధాన వారధిగా ఉన్న మున్నేరు నదిపై తీగల వంతెన (సస్పెన్షన్ పై తీగల బ్రిడ్జి) నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నా ‘యి. ఖమ్మంలో మున్నేరు నదిపై పాత వంతెన స్థానంలో ఆకర్షణీయంగా తీగల వంతెన నిర్మి స్తున్నారు. 2024 ఏప్రిల్లో పనులు మొదలుపె ట్టగా, ఆగస్టు, సెప్టెంబరులో భారీ వరదలొచ్చి నిలిచిపోయాయి. 2025 సెప్టెంబర్లోనూ వర దలతో పనులు ఆగాయి. వంతెన నిర్మాణానికి ప్రభుత్వం 2026 జూన్ వరకు గడువిచ్చింది. తర్వాత ఈ ఏడాది సెప్టెంబరు వరకు గడువు పెంచగా అది కూడా ముగిసింది. మరో నాలుగు నెలలు గడువు పెంచాలని గుత్తేదారు కోరుతున్నట్లు సంస్థ తెలిసింది. మున్నేరు నదిపై (రివర్ పోర్షన్) 690 మీటర్ల పొడ వు నాలుగు వరుసల్లో వం తెన నిర్మాణం పూర్తి చేశారు. దానిపై తారు రోడ్డు వేశారు. ఖమ్మం కాల్వొడ్డు వైపు అప్రోచ్ రోడ్ 180 మీటర్లు, జలగం నగర్ వైపు అఫ్రోచ్ రోడ్డు 380 మీటర్లు నిర్మిస్తున్నారు. జలగంనగ ర్ వైపు అప్రోచ్ రోడ్డు పూర్తి కావచ్చింది. ఖ మ్మం కాల్వొడ్డు వైపు మాత్రం జాప్యం నెల కొంది. ఈ ప్రాంతంలో దుకాణాలు కోల్పోయిన వారికి సుమారు రూ.30 కోట్లకు పైగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉండగా, నిధులు విడుద ల కాలేదు. రెండు వైపులా అప్రోచ్ రోడ్లు పూర్తి చేసి వాటిపై నాలుగు వరుసల్లో తారు వేయాల్సి ఉంది. ఫుట్ పాత్ లు, వంతెనకు రంగుల వేయ డంతోపాటు విద్యుద్దీకరణ పనులు చేపట్టి సుం దరంగా తీర్చిదిద్దాల్సిన పనులు మిగిలి ఉన్నా యి. త్వరగా తీగల వంతెన నిర్మాణం పూర్తి చేసి, అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరు తున్నారు. ఖమ్మం నగరానికి ప్రకాష్ నగర్ బ్రి డ్డి, కరుణగిరి చర్చి బ్రిడ్జి లు ఉన్నప్పటికీ నగరానికి రావాలంటే మున్నేరు బ్రిడ్జి చాలా కీలకం. సుమారు రెండు ఏళ్ళు దాటినా తీగల వంతెన పూర్తి కాకపోవడంపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. గుత్తేదారు సంస్థ ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి చేయగా ప్రభుత్వం నుంచి రూ.120 కోట్ల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నందున పనులు ముందుకు సాగటం లేదని తెలుస్తోంది. వచ్చే సంక్రాంతికి వంతెన నిర్మాణం పూర్తి చేసి ప్రజ లకు అందుబాటు లోకి రావొచ్చని అంచనా. ఖమ్మం-పాలేరు ని యోజకవర్గాలకు వారధిగా ఉన్న ఈ వంతెన కు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మరో నాలుగు నెలలు: డీఈ
ఆర్అండ్ బీ డీఈ భగవాన్ మాట్లాడుతూ వంతెన పనులు తుది దశకు చేరుకున్నాయి. నాలుగు నెలల్లో పూర్తి స్థాయిలో తీర్చిదిద్ది వాహనాల రాకపోకలకు అనుమతి ఇచ్చే అవ కాశముంది. రెండు వైపులా అప్రోచ్ రోడ్లు. సర్వీస్ రోడ్లు పనులు చేయాల్సి ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *