ఇకపై అన్ని సబ్జెక్టులకు ప్రాక్టికల్స్?

– సిలబస్ తోపాటు మారిన మార్కుల విధానం

హైదారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం (2026-27) నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు కీలక మార్పులు తీసుకొచ్చింది. చదువుకునే సిలబస్ తోపాటు పరీక్షల విధానంలోనూ సమూల మార్పులు చేశారు. ఇప్పటివరకు కేవలం కొన్ని సబ్జెక్టులకే పరిమితమైన ప్రాక్టికల్స్ ను ఇప్పుడు అన్ని సబ్జెక్టులకు (ఇంటర్నల్ అసెస్మెంట్ రూపంలో) ప్రవేశపెట్టారు. ఈ కొత్త విధానంపై విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు కూడా పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. కొత్త విధానం ప్రకారం మొత్తం మార్కుల్లో రాత పరీక్షకు 80శాతం, ప్రాక్టికల్స్  కు 20 శాతం మార్కులను కేటాయించారు. ఒకవేళ ఎగ్జామ్ 80 మార్కులకు ఉంటే విద్యార్థులు పాస్ కావాలంటే కనీసం 28 మార్కులు (35 శాతం) సాధించాల్సి ఉంటుంది. అలాగే ప్రాక్టికల్స్ కు కేటాయిం చిన 20 మార్కులలో కనీసం 7 మార్కులు వస్తేనే పాసైనట్లు లెక్క. సైన్స్ సబ్జెక్టుల విషయానికి వస్తే గతంలో కేవలం సెకండియర్ లోనే ప్రాక్టికల్స్ ఉండేవి. కానీ, ఇకపై ఫస్టియర్ లోసగం, సెకండియర్ లో మరో సగం చొప్పున ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఇంగ్లీష్ సబ్జెక్ట్ విషయంలోనూ బోర్డు స్పష్టతనిచ్చింది. ఫస్టియర్ విద్యార్థులకు ఒకే ఒక పాఠ్య పుస్తకం ఉంటుంది. ఇక సెకండ్ ఇయర్ లో టెక్స్ట్ బుక్‌ తోపాటు ప్రత్యేకంగా ‘ఇంగ్లిష్ ప్రాక్టికల్ మాన్యువల్’ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త మార్పులు, సిలబస్ వివరాలు, సబ్జెక్టుల వారీగా మార్కుల కేటాయింపు వంటి సమస్త సమాచారాన్ని అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచామని బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు. ఈ కొత్త పరీక్షా విధానంపై విద్యార్థులకు ఎటువంటి గందరగోళం లేకుండా చూడాల్సి న బాధ్యత కళాశాలల యాజమాన్యాలపై ఉం ది. ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు ఉంటా యి. పాస్ మార్కులు ఎలా లెక్కగడతారు అనే వివరాలను ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు విద్యా ర్థులకు అర్థమయ్యేలా వివరించాలని బోర్డు ఆదేశించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *