అనాదిగా అతివలకు అండగా
అన్నాచెల్లెళ్ల అనుబంధాలకు
మమకార మాధుర్యాలకు
ఆత్మీయతకు రక్షణగా రాఖీ
మహేంద్రునికి ఇంద్రపదవి
మళ్ళీ కట్టబెట్టిన రాఖీ
పాతాళం నుంచి విష్ణుమూర్తిని
లక్ష్మీదేవికి అప్పగించిన రాఖీ
ద్రౌపదికి వలువలు ఇచ్చి
నారీ గౌరవం నిలిపిన రాఖీ
అలెగ్జాండర్ కు ప్రాణ బిక్ష
పురుషోత్తముని హస్త రాఖీ
యముని భగినీ హస్త భోజనం
ఆత్మీయ అనుబంధాలకు నిదర్శనం
విజయ అభయ ఆశిస్సుల రాఖీ
నేడు అన్నా ఆని నోరారా పిలువంగ
సోదరీయని అండగ వుండక
నీతి మాలి, భీతి లేక
అతివలపై అఘాయిత్యాలు
చేయుచుండిరి మధాంధులు
ఏమైనదమ్మా నాటి నీ తేజస్సు!
లేరా కోదండరాములు!
రారా ఛక్రదారులు !
కళ్ళు తెరవండి సోదరులారా!
రాఖీ అంటే శ్రీ రామ రక్షై నిలవాలి
మనమే అవుదాం
ఆ కోదండరాములం, ఛక్రదారులం
సౌభ్రాతృత్వం సౌభాగ్యాలు
కాపాడే ఆ పురుషోత్తములం!
– పి.బక్కారెడ్డి, 97053 15250