ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
సిద్ధిపేట,ప్రజాతంత్ర,జనవరి10: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్‌పూర్ మండలం మునిగడప మల్లన్న ఆలయం వద్ద జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మునిగడప మల్లన్న గుడి మూలమలుపు వద్దనున్న గుంతలో కారు పడిపోయింది.
ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు.ఇద్దరు గాయపడగా.. హాస్పిటల్ కి తరలిస్తున్న సమయంలో మరొకరు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా యాదాద్రిజిల్లా బొమ్మలరామారం గ్రామానికి దిన వారని సమాచారం. వేములవాడకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.