– సీఐ అరాచకాలపై డీజీపీకి ఫిర్యాదు!
– పెళ్లి పేరుతో వివాహితపై అత్యాచారం, బలవంతపు అబార్షన్
– ఖమ్మం టూ టౌన్ పిఎస్ లో కేసు.. డీజీపీ కార్యాలయానికి అటాచ్
– ఆయన కాలం నాటి కేసులపై రీ-ఎంక్వైరీ జరపాలని బాధితుల డిమాండ్
ఖమ్మం, ప్రజాతంత్ర, మే 19 : న్యాయం కోసం వచ్చిన వివాహితను ప్రేమ పేరుతో మోసం చేసినట్లు ఓ ఇన్ స్పెక్టర్ (సీఐ)పై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని, ఆ తర్వాత బలవంతంగా టాబ్లెట్లు మింగించడంతో అబార్షన్ అయిందని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమెను తీవ్రంగా వేధింపులకు గురిచేయడంతో ఈ విషయం వెలుగులోకి వొచ్చింది. 2023లో ఆ మహిళ తన భర్త తనను ఇబ్బంది పెడుతున్నాడంటూ ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్ ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని మాట్లాడటం ప్రారంభించాడు. క్రమంగా నమ్మించి, లొంగదీసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఇటీవల ఖమ్మం నగరంలో పోలీసులు కేసు నమోదు చేయగా ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. సదరు సీఐ వేధింపులపై విచారణ చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. మహిళా పీఎస్‌లో ఎస్‌హెచ్‌వోగా ఉన్న సమయంలో ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకుని మరీ అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో అరాచకాలు సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను బ్రోకర్ల సహాయంతో నమోదు చేసిన అన్ని కేసులపై రీ ఎంక్వయిరీ చేయించాలని బాధితులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. భార్యాభర్త ల కేసుల్లో మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్న తర్వాత రాజీ పడిన కేసుల్లోనూ , భార్యలకు మాయమాటలు చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు ఇప్పిస్తానని నమ్మబలికాడు. కౌన్సెలింగ్ టీం పేరిట మహిళా పోలీస్ స్టేషన్ లో దలారీ పనులు చేసే బ్రోకర్ల ద్వారా తప్పు డు ఫిర్యాదులు, దొంగ సాక్షాలు పెట్టించి భర్తలను బ్లాక్ మెయిల్ చేశాడని విమర్శలు ఉన్నాయి. బెదిరింపులకు భయపడిన వారు సదరు టీం కు పెద్ద మెత్తం లో డబ్బులు ముట్టజెప్పి కేసుల నుంచి బైటపడేలా సదరు పోలీస్ అధికారి వ్యూహం పన్నేవారని పలువురు వాపోతున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఛార్జ్ షీట్ వేయకుండా నెలల తరబడి బెదిరింపులకు, వసూళ్ల కు పాల్పడే ప్రైవేటు వ్యక్తులను సదరు అధికారి ఏర్పాటు చేసుకునేవారని బాధితులు తెలిపారు. ప్రస్తుతం ఖమ్మం క్రైమ్ స్టేషన్ లో పని చేస్తున్న సదరు సీఐపై బాధిత మహిళా ఫిర్యాదు మేరకు ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీతో ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయానికి అటాచ్ (బదిలీ) చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

