- ప్రతీఒక్కరి ఆశీర్వదాలు అందాయి ధన్యవాదాలు… అందుబాటులో ఉండను
- మీ అభిమానాన్ని… సమాజ సేవలో చూపించండి
- మీ ప్రేమను సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా చాటండి
- మీ అభిమానానికి నమస్కరిస్తున్న
- తన జన్మదినం సందర్భంగా పార్టీ శ్రేణులకు, అభిమానులకు పిలుపునిచ్చిన మంత్రి హరీష్ రావు
సిద్దిపేట, జూన్ 2 (ప్రజాతంత్ర బ్యూరో): మితృలకు, అభిమానులకు హృధయపూర్వక నమస్కారములు. నా పుట్టిన రోజు (జూన్ 3)న రేపు శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు , సందేశాలు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఙతలు. మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కోరారు.
జూన్ 3న (శుక్రవారం) నేను హైదరాబాద్ లో కాని, సిద్ధిపేటలో కాని ఉండడంలేదు.ముందే నిర్ణయించుకున్న వ్యక్తిగత కార్యక్రమాల్లో భాగంగా నేను దూరంగా ఉండవలసి వస్తోందన్నారు..నా పట్ల మీ ప్రేమను సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల ద్వారా చాటాలని కోరుకుంతున్నా. మీ అభిమానానికి మరోసారి తలవొంచి నమస్కరిస్తున్నన్నా. మీరు చూపించే ఆదరాభిమానాలు , ప్రేమ ను నా గుండెల్లో పెట్టుకుంటాన్నారు.