చెరగని చెదిరిపోని
నిజం
కళ్ళ ముందే కదలాడే
నిజం బహు బరువైన
చేదు నిజం నేటి తల్లితండ్రులు ఆవేదన
అల్లారు ముద్దుగా
ఎదిగిన బాల్యం
అంచెలంచులుగా సాగిన చదువు
కన్నులు వైకుంఠముగా జరిగిన కల్యాణం
రోజులన్నీ ఇలా వచ్చి
అలా వెళ్లిన చుట్టంలా
ఇంకా చేయి పట్టి
నడిచినట్టే చెరగని ముద్ర నిలిచిన
గడిచిన గతం వీడని కలగా వేదిస్తూనే
ఆనాటి వారి బాధ్యత
నేడది బరువైయ్యింది
ఇల్లు విశాలం
మనసులు ఇరుకు
ప్రేమలు ఆప్యాయతలు లేని
ఆధునిక జీవితాలు యంత్ర
పరికరాలయ్యాయి
మమతలు లేని యంత్రశాలకు
నిదర్శనం నేటి జీవన విధానము
అనురాగాలకు ఆమడదూరముగా
వృద్ధాశ్రామాలే చేరువుగా
నేటి తల్లితండ్రుల చిరునామా
పంచిన ప్రేమలు
పెంచిన మమతలన్నీ
ఆధునిక మోడుబారిన
జీవాలకు పెట్టుబడిగా
మల్లించినా లాభలాసించని
కుటుంబ విలువలు
చేదు నిజలుగా చెరగని
ముద్రవేస్తూన్నాయి..
-ఎం.లక్ష్మి
తెలుగు అధ్యాపకులు
రామచంద్రపురం
తెలుగు అధ్యాపకులు
రామచంద్రపురం