నేడు భగత్ సింగ్ జయంతి
ఆయన భారత స్వాతంత్య్ర సమర యోధుడు. కరుడుకట్టిన ఉద్యమ కారుడు. ఢిల్లీ వీధిలో ఎర్ర కాగితాలు చల్లి ప్రజలలో స్వాతంత్య్ర పిపాసను జాగృతం చేసిన చైతన్యశీలి. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చి, ప్రజల గుండెల్లో ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా విప్లవ జ్వాలల ను రగిలించిన విప్లవ మూర్తి. భారత స్వాతంత్య్రో ద్యమములో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవ కారులలో ఆయన ఒకడు. ఆయనే భరతమాత ముద్దుబిడ్డ, షహీద్ భగత్ సింగ్. భగత్ సింగ్ భగత్ సింగ్ (1907 సెప్టెంబరు 28 -1931 మార్చి 23) పూర్వపు పంజాబ్‌లో, ప్రస్తుత పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా సమీపంలోని ఖత్కర్ కలాన్ గ్రామంలోని సంధు ఝాట్ కుటుంబంలో సర్దార్ కిషన్ సింగ్ , విద్యావతి దంపతులకు జన్మించాడు. భగత్ అనే పదానికి ‘‘భక్తుడు’’ అని అర్థం. భగత్ సింగ్ మూడేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు తండ్రి కిషన్ సింగ్, భగత్ సింగ్‌ను చంకనెత్తుకొని, కొత్తగా వేస్తున్న తోటను చూడ్డానికి పొలాల్లోకి వెళ్ళాడు. వెంటనే కిందికి దిగిన భగత్ సింగ్ ఆ మట్టిలో ఆడు కుంటూనే చిన్న చిన్న గడ్డిపరకలను నాటడం మొదలు పెట్టాడు. తండ్రి ‘‘ఏం చేస్తున్నావ్ నాన్నా’’ అని ప్రశ్నిస్తే, భగత్ సింగ్ ‘‘తుపాకులు నాటుతున్నా’’ అని బదులిచ్చాడు. భవిష్యత్తుకు బాల్యం మొలకలు వేసే వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని యోచించడం ఆయన వ్యక్తిత్వానికి మచ్చుతునక. ప్రాధమిక విద్యను స్వగ్రామంలోనే పూర్తిచేసిన భగత్, ఉన్నత విద్యాభ్యాసం కొరకు లాహోర్ చేరాడు. అక్కడ లాలాలజపతి రాయ్, భాయ్ ప్రేమానంద్ వంటి అగ్రశ్రేణి స్వాతంత్య్ర సమరయోధులు బోధన చేస్తున్న ‘నేషనల్ కాలేజ్’ లో చదవడం భగత్ ను విప్లవకారుడిగా తీర్చి దిద్దాయి.
13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణో ద్యమానికి సింగ్ ప్రభావితు డయ్యాడు. ఆ సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన భగత్ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు, బ్రిటీషు దిగుమతి దుస్తులను తగుల బెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు.
భారత దేశానికి వచ్చిన సైమన్ కమిషన్లో ఒక్క భారతీయుడైనా లేనందుకు నిరసనగా, ఉద్యమంలో లాల్‌జీ కీలక పాత్ర వహించి, సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలి అంటూ పంజాబ్ అసెంబ్లీలో ఆయన తీర్మానం పెట్టి గెలిపించారు. ఇది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. అక్టోబర్ 30, 1928న ఆ కమిషన్ లాహోర్ రాగా, లాల్‌జీ కూడా అహింసతో, మౌనంగా సైమన్ వ్యతిరేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మౌనంగా ఉద్యమిస్తున్న వారిపైన కూడా లాఠీ చార్జికి ఆదేశించాడు పోలీసు సూపరింటెండెంట్ జేమ్స్ ఏ స్కాట్. తను స్వయంగా లాల్‌జీ మీద దాడి చేసి, లాల్‌జీ ఛాతీ మీద లాఠీతో స్కాట్ తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలతోనే లాల్‌జీ నవంబర్ 17న చనిపోయారు.
ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చు కోవాలని నిర్ణయించు కున్నాడు. పోలీసు అధికారి స్కాట్‌ను హత మార్చడానికి విప్లవ కారులు శివరామ్ రాజ్‌గురు, జై గోపాల్, సుఖ్‌దేవ్ థాపర్‌లతో ఆయన చేతులు కలిపాడు. డీఎస్పీ జే. పీ. సాండర్స్ కనిపించినప్పుడు పొరపాటుగా స్కాట్ అనుకుని, జైగోపాల్ ఆయన్ను కాల్చమంటూ సింగ్‌కు సంకేతా లిచ్చాడు. ఫలితంగా స్కాట్‌కు బదులు సాండర్స్ హతమయ్యాడు. లాలా లజ్‌పత్ రాయ్ మరణం, సాండర్స్ హత్యల తరువాత 1928లో భారత్ లోని వర్థమాన రాజకీయ పరిస్థితిపై నివేదికను కోరుతూ సర్ జాన్ సైమన్ నేతృత్వంలో బ్రిటీష్ ప్రభుత్వం ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఫిరోజ్ పూర్లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హత మార్చినందుకు గాను వారికి 1930లో అక్టోబర్ 7వ తేదీని ఈ మరణ శిక్షను ఖరారు చేశారు.
భగత్ సింగ్ సహా ముగ్గురికి ఉరిశిక్ష ఖరారు చేసిన తీర్పు వివరాలను 2015లో ప్రచురించారు. ‘%ఔ•తీతీ•అ• శీ• జుఞవ•••ఱశీఅ •అ •వఅ•వఅ•వ •• ణవ••ష్ట్ర%’ అనే విడుదల చేసిన పత్రంలో 1930 అక్టోబర్ 7వ తేదీన ఉరిశిక్ష విధిస్తూ తీర్పిచ్చినట్లు స్పష్టంగా ఉంది. 1931, మార్చి 23న ఉరిశిక్ష అమలు చేసినట్లు మరో పత్రంలో వివరాలు ఉన్నాయి. జైలు సూపరింటెండెంట్ సంతకం చేసిన పేపర్‌ను టైమ్స్ ఫ్యాక్ట్ చెక్ గుర్తించి బహిర్గతం చేసి, లాహోర్ లోని పంజాబ్ శాఖలో ఈ పత్రాలను ఇటీవల ప్రదర్శనకు ఉంచారు. 1930 అక్టోబర్ 7 న న్యాయ స్థానము తీర్పును వెలువరించింది. తీర్పు 281 పేజీల్లో ఇవ్వబడింది. విచారణ ఎదుర్కొన్న వారందరికీ ఇలా శిక్షలు ఇవ్వబడ్డాయి. ఉరిశిక్ష: 1.భగత్ సింహ్ 2. సుఖఃదేవ్ 3. రాజగురులకుబీ అలాగే ఆజన్మాంతర జీవిత ఖైదు: 1.కిశోరీలాల్ 2. మహావీర్ సింహ్ (అండమాన్లో 9 రోజులు నిరాహార దీక్ష చేసి అమరుడయ్యాడు. 3. విజయ్ కుమార్ సింహ్ 4. శివవర్మ 5. గయా ప్రసాద్ 6. జయ దేవ్ కపూర్ 7. కమల్నాథ్ తివారిలకుబీ అలాగే జీవిత ఖైదు: 1.కుందాన్లాల్ ( 7 సంవత్సరాలు) 2. ప్రేమదత్ ( 5 సంవత్సరాలు)లకుబీ అలాగే అజయ్ ఘోష్, సురేంద్రనాథ్ పాండియ ఇంకా జితేంద్రనాథ్ సన్యాల్ లను విడిచి పెట్టారు. విచారణ లో ఉన్నవారందరూ కోర్టులను బహిష్కరించడం వలన తీర్పును లాహోర్ లోని సెంట్రల్ జైలు లో వినిపించారు.
తమను యుద్ధ ఖైదీలుగా గుర్తించడం ద్వారా ఉరి తీయకుండా కాల్పుల బృందం చేత హతమార్చాలని జైలులో ఉన్నప్పుడు భగత్ సింగ్ , మరో ఇద్దరు వైస్రాయికి లేఖ రాశారు. క్షమాభిక్ష ముసాయిదా లేఖపై సంతంకం కోసం భగత్ సింగ్ మిత్రుడు ప్రన్నత్ మెహతా ఆయన్ను ఉరితీయడానికి నాలుగు రోజుల ముందు మార్చి 20న జైలులో కలిశాడు. అయితే సంతకం చేయడానికి సింగ్ నిరాకరించాడు. మార్చి 23న ఉరితీసినట్లు జైలు అధికారులు మరణ ధ్రువీకరణ పత్రాన్ని విడుదల చేశారు. అప్పటి సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ వి.ఎన్. స్మిత్ ప్రకారం, భగత్ సింగ్‌ను ముందుగానే ఉరితీశారు. సాధారణంగా ఉదయం 8 గంటలకు ఉరితీసేవారు. అయితే ఏమి జరిగిందో ప్రజలు తెలుసుకునే లోగానే ఆయన్ను ఉరితీయాలని నిర్ణయించుకుని..సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో ఉరి తీశారు. భగత్ సింగ్ వీర మరణం వృథా కాలేదు, ఎందరో యువకులను భారత స్వాతంత్య్రోద్యమము వైపుకు మరల్చింది. భగత్ సింగ్ మరణం భారత స్వాతంత్య్రోద్యమ కొనసాగింపుకు సాయపడేలా వేలాది మంది యువకుల్లో స్ఫూర్తిని నింపింది. ఆయన ఉరి అనంతరం ఉత్తర భారతాన పలు ప్రాంతాల్లో బ్రిటీష్ ప్రభుత్వమునకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494