Take a fresh look at your lifestyle.

భారత్‌లో విలీనమైన శుభ సందర్భం

సెప్టెంబర్‌ 17‌కు ఉన్న ప్రత్యేకత అదే
విచ్చిన్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
జెండా ఆవిష్కరించి ప్రసంగించిన కెటిఆర్‌

రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 17 : ‌తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్చ పొందడానికి ఆనాటి యావత్‌ ‌సమాజం ఉద్యమించిందని..ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలుస్తాయని ఐటీ, మున్సిపల్‌ ‌శాఖమంత్రి కేటీఆర్‌ అన్నారు. సెప్టెంబర్‌ 17‌కు ప్రత్యేకత ఉందని, ఆనాడు హైదరాబాద్‌ ‌సంస్థానం భారత్‌లో విలీనం అయ్యిందన్నారు. జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశంలో ప్రతిఘాతక శక్తులు రెచ్చిపోతున్నాయని..మతతత్వ శక్తులు తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్ర చేస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరించి, మలినం చేసే కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే.. సెప్టెంబర్‌ 17 ‌సందర్భాన్ని కూడా వక్రీకరిస్తున్నారని వాఖ్యానించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు మంటలు రగిలిస్తున్నాయని.. ఈ నేల శాంతి, సౌభాగ్యాలతో ఉండాలే తప్ప.. అశాంతి, అలజడులతో కాదన్నారు. మతోన్మాద శక్తుల నుంచి మరోసారి జాగ్రత్త పడాల్సిన అవసరముందని మంత్రి పేర్కొన్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో కేటీఆర్‌ ‌పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌ప్రసంగిస్తూ..స్వరాష్ట్ర  ఏర్పడ్డ ఎనిమిదేండ్ల లోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా, సఫల రాష్ట్రంగా తీరిదిద్దామని కేటీఆర్‌ ‌తెలిపారు. నాటికి నేటికీ తెలంగాణలో వొచ్చిన మార్పులకు దేశం మొత్తం మనవైపే చూస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ‌సహా ఎన్నో అనితరమైన పనులను సుసాధ్యం చేశామని, రాజన్న సిరిసిల్ల జిల్లాను అభివృద్ధి,సంక్షేమంలో ముందంజలో నిలిపామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ ‌పాలనదక్షత, సమర్థ నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. 1947 సెప్టెంబర్‌ 17‌న భారత్‌లో హైదరాబాద్‌ ‌విలీనమైందన్నారు. కొమురం భీం, దొడ్డి కొమురయ్య సాహసాలు మరువలేనివన్నారు. ఎందరో మహానుభావులు సామాజిక చైతన్యాన్ని రగిలించి నట్టు చెప్పారు. తెలంగాణ సమాజం రాచరిక వ్యవస్థ నుంచి.. ప్రజాస్వామిక స్వేచ్ఛవైపు పయనించిందని కేటీఆర్‌ ‌తెలిపారు. ఆనాటి ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. రాష్టాల్ర పునర్‌వ్యవస్థీకరణ పేరిట.. హైదరాబాద్‌ ‌రాష్టాన్న్రి  బలవంతంగా ఏపీలో కలిపారని వ్యాఖ్యానించారు. ఏపీలో విలీనంపై హైదరాబాద్‌ ‌ప్రజలు అప్పుడే ఆందోళన చెందారన్నారు. తెలంగాణ ప్రజలను ఏకం చేసి 14 ఏండ్లు సీఎం కేసీఆర్‌ ‌పోరాటం చేశారనీ గుర్తుచేశారు.

సుదీర్ఘ పోరాటం తర్వాత మళ్లీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందన్నారు. ఇప్పుడు దేశానికే టార్చ్ ‌బేరర్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ జాతీయ స్థాయికంటే ముందుందన్నారు. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా నేడు తెలంగాణ ఎదిగిందన్నారు. వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ప్రసంగం పూర్తయిన అనంతరం మంత్రి కేటీఆర్‌ ‌స్వాతంత్య ్రసమరయోధులను ఘనంగా సన్మానించారు. వేదిక వద్దకు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్న సమర యోధుల చెంతకు మంత్రి వెళ్లి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలో న్యాక్‌ ‌ద్వారా 30 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న 25 మంది మహిళలకు మంత్రి కేటీఆర్‌ ‌కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఆనాటి ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆదివాసి యోధుడు కుమురంభీం, తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమురయ్యలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహానీయులు రావి నారాయణరెడ్డి, స్వామి రామానంద తీర్ధ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, వీరవనిత చాకలి ఐలమ్మ వంటి ప్రజానేతల త్యాగాలను స్మరించుకొందామని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు.

తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాపరెడ్డి,ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియోద్దీన్‌, ‌షోయెబుల్లాఖాన్‌ ‌వంటి సాహితీ మూర్తులకు ఘన నివాళులు అర్పిద్దామని అన్నారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబుతో కలిసి సన్మానించారు. దేశానికి కావల్సింది విభజన రాజకీయాలు కాదని సూచించారు. దేశానికి నిర్ణయాత్మక విధానాలు కావాలన్నారు. నాలుగు దశలుగా తెలంగాణ ఉద్యమం జరిగిందని మంత్రి కేటీఆర్‌  అన్నారు. ఇడ్లి సాంబార్‌ ‌గో బ్యాక్‌, ‌సాయుధ పోరాటం, తొలి దఫా ఉద్యమం, కేసీఆర్‌  ‌హయాంలో మరోసారి ఉద్యమం జరిగిందని గుర్తు చేశారు. కాగా  పోరాట చరిత్రను కొందరు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. మత పిచ్చి మంటల కోసం ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పచ్చని పంటలతో తెలంగాణ ముందుకు వెళ్తోందని, విద్వేష కర కుట్రలను తిప్పికొట్టాలని తెలిపారు. మనది వసుధైక కుటుంబమని మంత్రి కేటీఆర్‌  అన్నారు. తెలంగాణ సాకారం అయ్యాక ఎంతో అభివృద్ది జరిగిందన్నారు. ఎనిమిదేళ్లలో తెలంగాణ జీవన ముఖచిత్రం ఎంతగానో మారిపోయిందని కేటిఆర్‌ ‌తెలిపారు. పచ్చని పొలాలతో, చక్కని మౌలిక వసతులతో శాంతికి నెలవుగా తెలంగాణ అలరారుతున్నది. సర్వతోముఖాభివృద్ధిని సాధిస్తూ రాష్ట్రం ప్రగతిబాటలో పయని స్తున్నది. ఈ తరుణంలో మతతత్వ శక్తులు తెలంగాణ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తూ అప్రమత్తంగా ముందడుగు వేయాలని సూచించారు. కలెక్టర్‌, ఎస్పీ తదిరులు పాల్గొన్నారు.

Leave a Reply