హైదరాబాద్, మే 26: అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్న రెయిన్‌బో హెమ్స్‌లో విధ్యనభ్యసిస్తున్న యువ సైలర్ రమేజా భానును పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సచివాలయంలో అభినందించారు. ఒమన్, సింగపూర్‌లలో నిర్వహించిన అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన రమేజా భాను పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో విశిష్ట ప్రతిభ కనబరిచింది. వచ్చే వారం మొరాకోలో జరగనున్న అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో మరోసారి భారతదేశం తరఫున పాల్గొననున్నది. ఈ సందర్భంగా రమేజా భాను మంత్రి సీతక్కను కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నది. ఆమెను అభినందిన మంత్రి సీతక్క భవిష్యత్తులో భాను మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ యువత అంతర్జాతీయ వేదికలపై దేశానికి కీర్తి తీసుకురావడం గర్వకారణమని అన్నారు. రమేజా భాను వంటి ప్రతిభావంతులైన యువ క్రీడాకారిణులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. మొరాకో పోటీల్లో రమేజా భాను విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ ఆమెకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




