రాష్ట్రంలో అలాంటివి లేవన్న డిప్యూటి స్పీకర్
హైదరాబాద్,మార్చి11(ఆర్ఎన్
హైదరాబాద్ సిటీలో ఎక్కడా కూడా బెల్ట్ షాపు అనేది ఉండదు. హైదరాబాద్ మొత్తంలో ఒక్క బెల్ట్ షాపు కూడా ఉండదు. జిల్లాల్లో కూడా ఎట్ల ఉంటది అంటే.. మండల్ హెడ్ క్వార్టర్స్ దగ్గర ఎక్కడో ఒక చోట, 10 కిలోవి•టర్ల దూరంలో వైన్ షాపు ఉంటది. అక్కడికి వెళ్లి తెచ్చుకునేందుకు ఇబ్బంది పడుతారని చెప్పి.. అదేదో తెచ్చి గ్రామాల్లో పెడుతరు. అయితే గ్రామానికి, కిరణా షాపుల్లో, అక్కడ ఇక్కడ బెల్ట్ షాపులు ఉండవని స్పష్టం చేశారు. గతంలో ఎక్సైజ్ మంత్రిగా పని చేశాను.. తాను ఇక్కడ కూర్చొని చెప్పొద్దు కానీ చెప్పాల్సి వస్తుందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.