జాతీయ రాజకీయాల్లో ఇప్పటికీ ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ప్రధాన రాజకీయపార్టీగా దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ చేవ చచ్చింది. మొన్నటి హిమాచల్ ఎన్నికల్లో అధికారం దక్కించుకున్నా అక్కడ బిజెపికి వారిని కుదురుగా పనిచేసునేలా చేస్తుందా అన్నది ప్రశ్నే. ఈ క్రమంలో జాతీయ రాజకీయా ల్లోకి ప్రవేశించిన తెలంగాణ సిఎం కెసిఆర్ ఏ మేరకు ప్రభావం చూపుతారన్నది కూడా అనుమానమే. ఇప్పటి కైతే కెసిఆర్ ఎలాంటి అడుగులు వేయడం లేదనే చెప్పాలి. విపక్షాలను కూడగట్టి ముందుకు సాగాల్సిన తరుణం ఇది. గతంలో ఎన్టీఆర్ పోషించిన పాత్రను ఇప్పుడు కెసిఆర్ తీసుకోవాలి. విపక్షాల్లో ఐక్యత తెస్తే తప్ప మోదీ• నాయకత్వంలోని బిజెపిని నిలవరించడం సాధ్యం కాదని గుర్తించాలి. విపక్షాలు కూడా స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి ముందుకు రావాలి. టిఆర్‌ఎస్ ఇప్పుడు బిఆర్‌ఎస్‌గా మారినా పెద్దగా స్పందన కానరావడం లేదు. ఆయనకు మద్దతుగా కర్నాటక మాజీ సిఎం ఒక్క కుమారస్వామి మాత్రమే కనిపిస్తు న్నారు. ఆయన కూడా కేవలం కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ దోస్తానా చేస్తున్నారన్న విమర్శ లు కూడా ఉన్నాయి.
ఎందుకంటే కర్నాటకలో తెలుగువారు ప్రభావం చేయగలిగి నంతగా ఉన్నారు. ఇకపోతే యూపికి చెందిన అఖిలేశ్ యాదవ్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి మొక్కుబడిగా వచ్చి పోయారు. మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్దవ్ థాక్రే లాంటి వారు ఇప్పటికీ పెద్దగా స్పందించలేదు. ఆయా రాష్టాల్ల్రో ఎవరి సమస్యలు వారికి ఉన్నాయి. ఎవరి ఇగోలు వారికి ఉన్నాయి. ఎవరికి వారు తామే మోదీకి• ప్రత్యమ్నా య నేతగా ఊహించుకుంటున్నారు. ఛాన్స్ వస్తే తామే ప్రధాని పదవికి అర్హులమన్న ధీమాలో ఉన్నారు. ఈ క్రమంలో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకుని వచ్చే ప్రయత్నాలు అవసరం. గతంలో ఎన్టీఆర్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టి ఎన్‌డిఎ ఏర్పడడానికి కృషి చేశారు. ఇప్పుడు కూడా కెసిఆర్ అలాంటి పాత్ర పోషించాలి. ఆనాడు ఉమ్మడి ఎపిగా ఉన్న ఎన్టీఆర్ బిజెపి, లెఫ్ట్ పార్టీలను కూడా కూడగట్టారు. అలాంటి గట్టి ప్రయత్నం ఇప్పుడు అవసరం. భారత్ రాష్ట్ర సమితి బిఆర్‌ఎస్ రానున్న ఎన్నికల్లో మోదీకి• ప్రత్యామ్నాయం గా వివిధ పార్టీలను కలుపుకుని పోవాలి. నియంతృత్వ పోకడలతో, విద్వేష రాజకీయాలతో సాగుతున్న భారతీయ జనతా పార్టీని 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా కట్టడి చేయడం లక్ష్యంగా ముందుకు సాగడం అంత సులువు కాదు.
ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యే చరిత్రాత్మక పరిణామం దిశగా బిఆర్‌ఎస్ కృషి సాగితేనే కెసిఆర్ లక్ష్యం నెరవేరగలదు. కొన్ని నెలలుగా కెసిఆర్ ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజాభిప్రా యాలను తెలుసు కొంటున్నారు. బిజెపియేతర ప్రతిపక్షాలతో చర్చలు జరుపుతున్నారు. ఇవన్నీ సానుకూల సంకేతాలు ఇవ్వడం లేదు. ఏ ఒక్క నేత కూడా మనఃస్ఫూర్తిగా కలసి రావడం లేదు. దేశ రాజధాని దిల్ల్లీ బిఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించినప్పటికీ విపక్ష నేతల్లో చలనం కానరావడం లేదు. ఆసక్తి కూడా చూపడం లేదు. మోదీకి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేయడంలో అన్నిపార్టీలు నమేషాలు లెక్కిస్తున్నాయి. కార్పొరేట్ సామ్రాజ్యం విస్తరించి ప్రభుత్వ రంగసంస్థలన్నీ దాని గుప్పెటలోకి పోతోంది. ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం అవుతున్నాయి. విశాఖ ఉక్కు, ఎల్‌ఐసి లాంటి సంస్థలు కనుమరుగు అవుతున్నాయి. ఇంతటితోనే ఈ ప్రైవేటీకరణ ఆగదని అందరికీ తెలుసు. దీంతో ఉన్న ఉద్యోగాలు ఊడి, నిరుద్యోగం పెరిగి యువత అల్లాడుతోంది. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదంతో కాంగ్రెస్‌ను తుడిచిపెట్టుకుని పోయేలా చేయడంలో మోదీ• విజయం సాధించారనే చెప్పాలి. ప్రజావ్యతిరేక విధానాలతో సాగుతున్న పెడ ధోరణులను ప్రశ్నించే వారిపై ఇడి, సిబిఐ, ఐటి వంటి సంస్థల దాడులను ఉసిగొల్పుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బిజెపి ధృతరాష్ట్ర కౌగిలినుంచి కొన్ని నెలల క్రితమే బయట పడ్డా ఆయన కూడా కెసిఆర్‌కు కనీసంగా అండగా నిలుస్తామని, కలసి పనిచేద్దామని ముందుకు రావాడం లేదు. నిజానిక చెప్పాలంటే విపక్షాల ఐక్యతకు సంబంధంచి ఒక్క అడుగు కూడా పడడం లేదు. ఎవరికి వారు బిగుసుకుని కూర్చున్నారు. అయితే నితీశ్‌ది కూడా అవకాశవాదమనే విమర్శ ఉంది. బిజెపి వ్యతిరేక శక్తులను కూడగడతానని ప్రకటించినా ఆ మేరకు ఇంకా సరైన అడుగులు ముందుకు పడడంలేదు. తృణమూల్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం బిజెపికి వ్యతిరేకంగా పోరాడినా ఈ మధ్య ఆమె కూడా మెత్తపడ్డారు. విపక్షాలను ఏకం చేసే ప్రయత్నంలో ఆమె కూడా ఓ రకంగా విఫల మయ్యారు. రాష్టీయ్ర జనతాదళ్, నేషనలిస్టు కాంగ్రెస్ వంటి పార్టీలు కూడా సరైన మార్గ• •ర్శకత్వంలో నడవడం లేదు. మరోవైపు విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు జాతీయ ప్రతిపక్షంగా కాంగ్రెస్ గట్టి పాత్రను పోషిం చలేకపోతోంది. ఈలోటు భర్తీ చేయవలసిన అవసరం ప్రాంతీయ పార్టీలపై ఉండడంతో ఇప్పుడు కెసిఆర్ చేపట్టిన బిఆర్‌ఎస్ సరైన సమయంలో తీసుకున్న చర్య తీసుకునేందుకు అడుగు పెట్టినా అందుకు తగ్గ కార్యాచరణ ముఖ్యం. విపక్షాలను ఏకం చేసే లక్ష్యం కావాలి.జనాభాలో 40 శాతం మంది 13 ఉన్న యువతను కదిలించగలగాలి.
యువతకు భరోసా కలిగించేలా సాగాలి. బిజెపి బలం పెంచుకోడానికి నిరంతరంగగా పనిచేస్తోంది. బిజెపి బలంతో అన్ని రాష్టాల్ల్రో అధికారం చేజిక్కించుకోవాలన్న తాపత్రయం తో పావులు కదుపుతోంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి బలంగా పనిచేయాలి. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకుని రావాలి. వారిలో ఉన్న అనుమానాలను కెసిఆర్ నివృత్తి చేయగలగాలి. రాష్టాల్ర హక్కులు, సమాఖ్య వ్యవస్థ బలోపేతానికి ఇది అవసరం. ఇందుకు అనుగుణంగా కెసిఆర్ ఎలాంటి ప్రయత్నం చేస్తారన్నది చూడాలి. ఎపిలో టిడిపి, వైసిపి రెండు పార్టీలు కూడా మోదీకి అనుకూలంగా ఉంటున్నారు. వారికి తమ సొంత ఎజెండా ఉంది. అందువల్ల ఎపి నుంచి మద్దతు దక్కుతుందన్న అవకాశం లేదు. ఈ క్రమంలో కెసిఆర్ ఎలాంటి పాత్రపోషిస్తారో చూడాల్సిందే.
– ప్రజాతంత్ర డెస్క్