ఇదీ యుద్ధమే.
ఎదురుపడని ముఖాలు
ఎదసరిహద్దుల్లో మోహరించిన
ప్రేమమేఘాలతో యుద్ధరంగాలు.
మనసు ఓటమిని
కర్కశంగా ఇష్టపడే కాలం
మనిషి నమ్మకాన్ని పాతిపెట్టె దుశ్చర్యకు
పక్కనే ప్రేమను దాచిపెట్టే
మనసుది ప్రతిచర్య.
అపరిమిత వేగాభిమానమే అణ్వాస్త్రం.
అనిర్వచనమైన ఇష్టానుభవమే క్షిపణి.
జయాపజయాలు సరిసమానాలైన
అనివార్యశ్చర్యాలు.
నిర్మానుష్యమైన నిశబ్దసంగ్రామంలో
కళ్లెదుటే ప్రాణంపోగుట్టున్న రోజుల్లో
తలపోసిన భావాలు తలకొట్టుకుని
పునరంకితం కావాలన్న పశ్చాత్తాపం
నమ్మకాన్ని తవ్వి నిజాల్ని కొగిలించుకోవడం పరోక్ష విజయం.
ప్రేమకు ఊపిరి పొయడమే
ప్రత్యక్ష సాక్ష్యమే
యుద్దానికి స్వస్తి పలికే చరమవాక్యం.
– చందలూరి నారాయణరావు
9704437247