పిల్లల బంగారు భవిష్యత్తు ఉపాధ్యాయులతోనే….

నేడు విద్యా వ్యవస్థ ఒక రకంగా గాడి తప్పిందని చెప్పవచ్చు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి దానిలో ముఖ్యంగా పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అదే విధంగా పశ్చాత్వ సంస్కృతికి అల్లావాటు పడటం. పిల్లలకు ప్రాజెక్టు వర్క్ పేరుతో కంప్యూటర్ సెంటర్లు తిరుగుతున్నారని అదే విధంగా ఆన్ లైన్ క్లాస్ ల నిమిత్తము పిల్లలకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, ల్యాప్ టప్ వంటి ఇప్పించడం ద్వారా గురువులకు విద్యార్థులకు దూరం తగ్గుతుంది. పిల్లలు కూడా ఎక్కువ టైం సోషల్ మీడియాలో గడుపుతున్నారని పలు సర్వేలు తెలుపుతున్నాయి. ఒక్కప్పుడు గురువులు అంటే అపారమైన గౌరవము ప్రేమ, భయము ఉండేది ఇప్పుడు వచ్చిన చట్టాల ద్వారా పిల్లలను భయపెట్టి చదువు చెప్పే రోజులు పోయాయి దాని అలుసుగా తీసుకుని విద్యార్థులు గురువులను కామెంట్ చేస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. అలాంటి వారిని మందలించిన సందర్భంలో తల్లిదండ్రులు ఉపాద్యాయులపైకి తగదుకు వస్తున్నారు.

 

దీంతో పిల్లలు ఇష్టారాజ్యంగా తయారు అయి తప్పుదోవ పడుతున్నారు. నేడు పిల్లలు మత్తులో తూలుతున్నారు. ఆశ్చర్యకర విషయము ఏమిటంటే బర్త్ డే పార్టీల పేరుతో పబ్బుల వెంట తిరిగితూ మత్తు పానీయలకు బానిస అవుతున్నారు. ప్రస్తుతం తల్లి దండ్రులు ఉపాధ్యాయులు ర్యాంకుల పేరిట పిల్లలను ఒత్తిడికి గురి చేస్తున్నారు దీంతో పిల్లలు ప్రశాంతంత కోసం వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రులు వ్యక్తిత్వ విలువలు నేర్పకుండా ర్యాంకు, ఉద్యోగం సాధించాలని పిల్లలను బిజినెస్ మైండ్ తోనే పెంచుతున్నారు. ఈ మధ్యన జరిగిన సంఘటన ఒక స్కూల్ లో పిల్లలు ఒమ్ వర్క్ చేయడం లేదు, చెప్పిన మాట వినటంలేరు, రకరకాల హెర్ స్టైల్ తో స్కూల్ కు వస్తున్నారని, ఉపాద్యాయురాలు జుట్టు కట్ చేస్తే స్కూల్ కి వచ్చి తల్లిదండ్రులు తగువ పెట్టుకుని టీచర్ ని సస్పెండ్ చేయించిన పరిస్థితి చూశాము. ఇలాంటివి విద్యార్థులకు అలుసుగా మారుతున్నాయి, ఉపాధ్యాయులు విద్యార్థులను మందలించి సరైన మార్గం చూపడం వారి భాధ్యత, పిల్లలు ఉపాధ్యాయులపైన దాడులు చేసిన సందర్భాలు అనేకం వారిని వెనుక వేసుకుని వచ్చేది తల్లిదండ్రులే, దీంతో నష్టపోయేది మాత్రం విద్యార్థులే. ఉపాధ్యాయులు చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని సమర్థించడం లేదు విద్యార్థులకు టీచర్లు అంటే అభిమానం అయినా ఉండాలి లేదా భయమైనా ఉండాలి అప్పుడే గురువు శిష్యుల మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. శిష్యుడికి శాస్త్రములను గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస, శ్రద్ధ ఉండాలి.

అప్పుడే వారు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. దానికి తగ్గట్టు గురువు పట్ల వినయం, విధేయత కలిగి ఉండాలి. గురువు దగ్గరకు పోయినపుడు శిష్యుడు తనలో ఉన్న వినయమును, విధేయతను, శ్రద్ధను గురువు ముందు ప్రకటించాలి. గురువు అంటే ఆజ్ఞానాన్ని పారదోలేవాడు. ఆనాడు గురుశిష్యుల బంధం ద్రోణాచార్యుని శిష్యుడు ఏకలవ్య తన గురువు కోసం తన చేతి బోటన వేలు తీసి ఇచ్చాడు. అంతటి త్యాగ గుణం విద్యార్థులకు ఉండాలి, అలా తయారు చేసేది గురువులే. గోపాల కృష్ణ గోఖలే శిష్యుడు మహాత్మా గాంధీ, భారత యువతకు సన్మార్గమును భోదించిన రామకృష్ణ పరమహౕంస స్వామి వివేకానందుడి వంటి గురు భక్తి నేటి పిల్లలకు ఆదర్శం. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తే మిగతా వారు కూడా వచ్చామ పాఠం చెప్పామా వెళ్లమా అనే విధంగానే చూస్తారు. గురువులు రెండు రకాలు ఒకటి గురువు, రెండు సద్గురువు గురువు అంటే పాఠాలు మాత్రమే బోధించే వారు గురువు పాఠాలతో పాటు జీవిత సందేశాలను బోధించే వారు సద్గురువులు విద్యార్థి పాఠాలు వింటే చదువులో రాణిస్తాడో లేదో తెలియదు కానీ ఉపాధ్యాయుడు చెప్పిన జీవిత పాఠాలు విన్న విద్యార్థులు మాత్రం జీవితంలో విజయం సాధించిన వారు చాలా మంది ఉన్నారు.

 

గురువు అంటే “మార్గదర్శి, నిపుణుడు, ఉపాధ్యాయుడు అని అర్థం. ఇది సంస్కృత పదం గురు నుండి వచ్చింది భారతీయ సంప్రదాయంలో గురువు ఉపాధ్యాయుని కంటే ఎక్కువ. సాంప్రదాయకంగా, గురువు శిష్యుడికి లేదా విద్యార్థికి గౌరవప్రదమైన వ్యక్తి గురువుకు చారిత్రాత్మకమైన గౌరవపద గుర్తింపు పూరతనం నుండి ఉంది. విద్యార్థులు జ్ఞానం, సామర్థ్యం లేదా సత్ప్రవర్తన సంపాదించడానికి సహాయపడే వ్యక్తి. ఈనాటి సమాజంలో కుల, మత, ప్రాంతీయ విభేదాలు లేకుండా తమకు వచ్చిన విద్యాను అందరికి పంచుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అందరికి సంపూర్ణ విద్యాను అందించాలని ప్రయత్నిస్తున్న ఆశించిన స్థాయిలో సంపూర్ణ అక్షరాస్యత సాధించలేక పోతున్నాము.

ప్రస్తుత సమాజంలో కుల, మతాలకు అతీతంగా వివిధ రంగాలలో టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సాహిస్తున్నారు అది గురువుల గొప్పతనముగా చెప్పవచ్చు. ఉపాధ్యాయులకు గురువులు ఉన్న అనుబంధము డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని పదవీ విరమణ సమయంలో పిల్లలందరూ గుర్రపు బండిపై ఊరేగింపుగా తీసుకు వెళ్ళి తనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఉపాధ్యాయులు స్థాన చలనం చేసి వెళ్తున్నప్పుడు పిల్లల ఉపాధ్యాయుల భావోద్వేగాలు అందరిని కదిలించాయి. టీచర్లు స్కూల్ పిల్లలను ఇంట్లో వారిలా భావించి విద్యా బుద్ధులు నేర్పించి సమాజానికి అందిస్తారు. విద్యార్థులు విజయం సాధిస్తే వారి గెలుపుగా భావించే కల్మషమైన మనస్సు గురువులకు మాత్రమే ఉంటుంది. ఉపాధ్యాయులు చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో చిన్న చిన్న ఆర్థిక పరమైన అవసరాలు  తమ స్వంత డబ్బులతో అందించిన ఘనత ఉత్తమ ఉపాధ్యాయులకు ఉంది. ఇలా సమాజంలో గురువుల పాత్ర  కీలకమైనది. పిల్లల భవిష్యత్తులో తల్లిదండ్రుల పాత్ర ఎటువంటిదో గురువులది కూడా ముఖ్యమైన భూమిక పోషిస్తున్నారు.

-మిద్దె సురేష్
కవి, వ్యాసకర్త
9701209355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page