ప్రభుత్వ యాజమాన్యాల కింద నడుస్తున్న పాఠశాలలో విద్యార్థుల సామాజిక సమ భావన వృద్ధి చేయడం పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నంలో ప్రభుత్వ బడులను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు జాతీయ పౌష్టికార పథకం కింద జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన రోజువారి నియమావళి ప్రకారం చాలా పాఠశాల లలో విద్యార్థులకు సక్రమంగా ఆహార అందడం లేదన్న వాదనలు విభిన్న వర్గాలనుండి వినిపిస్తుండటం శోచనీయమే.
విద్యార్థుల తరగతి క్రమాన్ని బట్టి ఆహార పదార్థాల పరిమాణాన్ని నిర్దేశిస్తూ ప్రతిరోజు మధ్యాహ్నం పాఠశాలలో భోజనం వండి పెట్టేందుకు ప్రభుత్వం వర్కర్లను సహయకులను నియమించడం ఖర్చవుతున్న మొత్తాన్ని ప్రభుత్వాలే భరిస్తున్నాయి.
ప్రతిష్టాత్మకంగా పాఠశాలల్లో చేపట్టిన బాలల ఆరోగ్య పరిస్థితిపై అధ్యయనం చేసిన భారతదేశంలోని ప్రధాన కమిటీలైనా బోర్ మొదలియార్ సూచనలను పాఠశాల విద్యార్థులకు.తప్పనిసరిగా పౌష్టికాహారంతో కూడిన భోజనం ఆవశ్యకతను నొక్కి చెప్పాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పదిహేను ఆగస్టు పందొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సం నుండి అన్ని ప్రభుత్వ యాజమాన్యాల కింద పనిచేసే పాఠశాలలో ఈ పథకాన్ని అమలు చేసింది అమలు తీరును పరివేక్షించేందుకు అధికారులను నియమించింది. ఇటీవల ప్రభుత్వం సూచించిన భోజన పదార్థాల సూచిక ప్రకారం రోజువారి ఉండవలసిన ఆహార పదార్థాలు గుడ్లు.మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కిచిడి సాంబార్ ఆకుకూరలు వాటితోపాటు రాగి జావా లాంటి పౌష్టిక ఆహార పదార్థాలను రోజువారీగా నిర్వాహకులు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో అందించాల్సిందే.. అయితే చాలా పాఠశాలలో నిర్వాహకులు పలు కారణాలతో సరేైనా నిర్దేశికతను చాలా వరకు పాటించకపోవడం వంటి సమస్యలు అడపా తడపా జరుగుతున్న ఈ పథకం పై ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మద్యాహ్న భోజనంలో బహిర్గతమవుతున్న లోటుపాట్లను సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో సరిదిద్దాల్సి ఉంది.
నిర్వాహకులు నిర్లక్ష్యం వహిస్తున్నారా…
ప్రభుత్వ పాఠశాలలలో ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో మధ్యాహ్న భోజన నిర్వహణ వర్కర్లు హెల్పర్లుగా జిల్లా మండలాల్లోని కమిటీల ద్వారా ఎంపిక చేసి నిర్వాహుకులకు జీతభత్యాలను అందిస్తుంది. వారి జీతభత్యాలు కొంత పెంచిన ప్రస్తుత తరుణంలో వారి జీతాలు సక్రమంగా రావడం లేదంటూ హెల్పర్లు వర్కర్లు ఆందోళన చేపడుతున్న సందర్భాలు లేకపోలేదు. అయితే రోజువారి ఆహార పదార్థాల నియమావళిని ప్రభుత్వం అమలకు సిద్ధం చేసినప్పటికీ చాల మంది నిర్వాహకులు పాఠశాల యాజమాన్య కమిటీ పర్యవేక్షణ లోపంతో రోజువారి వంటలో జాబితాలో లేని వంటలు చేసి సరిపెట్టుతున్నారని విద్యార్థులకు సరైన రీతిలో పౌష్టికాహారం అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
భోజన నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలి…
మధ్యాహ్న భోజనానికి సంబంధించి గ్రామ రేషన్ డీలర్ దగ్గరుండి వచ్చే బియ్యంలో కారణాలు ఏమైనా తరచుగా నాణ్యత లోపించిన బియ్యం అందుతుండడం ఒక ఎత్తు అయితే నాణ్యత కలిగిన గుడ్లు తాజా కూరగాయలు పరిశుభ్రమైన పరిసరాలు అస్తవ్యస్తంగా ఉంటున్నాయన్న ఆరోపణలు రావడం ప్రభుత్వ నియమాలనుసరించి సక్రమంగా వర్కర్లు హెల్పర్లు దృష్టిసారించకపోవడం తరచుగా వివాదాస్పదమవుతుంది. పాఠశాల నిర్వాణ కమిటీలు సంబంధిత ప్రధానోపాధ్యాయుల మధ్య సమన్వయ లోపం ఏర్పడడం ఇందుకు కారణం అవుతుందేమో.. విద్యార్థుల శారీరక మానసిక అభివృద్ధి పాఠశాల విద్యా వ్యవస్థ స్థాయిలో కీలకమై ఉన్నందున విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అత్యంత ప్రధానమైనదిగా భావిస్తున్న ప్రభుత్వాల ఆలోచన సరళి ఉత్తమమైనప్పటికీ క్షేత్ర స్థాయిలో అనేక లోపాలు గోచరిస్తున్నాయి అని అనుకునే వారు లేకపోలేదు.
భాధ్యతయుతమైన పర్యవేక్షణ అవసరమే…
పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా లేకపోవడం అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వంటశాల నిర్మాణం ఉన్నప్పటికీ నీరు లాంటి సరైన వసతులు లేకపోవడం అనేక సమస్యలకు తావిస్తుంది. పాఠశాలలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం సక్రమంగా అందించేందుకు జిల్లా గ్రామ కమిటీలతో పాటు పాఠశాల యాజమాన్యాలు అధికారులు ప్రత్యక్షంగా నిరంతర పర్యవేక్షణ చూపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది
నిర్వాహనకు అయ్యే ఖర్చుపై జాప్యం వద్దు…
ప్రభుత్వం ఎప్పటికప్పుడు మధ్యాహన్న భోజనం నిర్వహణ కు అయ్యే ఖర్చులు నిర్ణీత సమయంలో అందించగలిగితే సరైన రీతిలో నిర్వాహకులు విద్యార్థులకు సక్రమంగా మధ్యాహ్న భోజనం అందించడంలో సఫలీకృతులవుతారేమో..! స్థానిక పరిస్థితి నిర్వాహకులకు ఆర్థికంగా ఎదురవుతున్న సమస్యలు అన్నింటిని అధిగమించి ఆహార పదార్థాల తయారీకిీ ముందుగా పెట్టుబడి పెట్టి మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నారు.. అయినా నెలలు తరబడి మధ్యాహ్న భోజన నిర్వాహకులకు జీతభత్యాలలో జాప్యం జరుగుతుంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయడం మధ్యాహ్న భోజన పథకం పై అధికారుల పర్యవేక్షణ నిరంతరం ఉండడం వలన మధ్యాహ్న భోజన పథకం విజయవంతంగా సఫలీకృతం అవుతుంది.
దాడిశెట్టి శ్యామ్ కుమార్
బీ. సీ. జే, వరంగల్ జిల్లా
:9492097974