పరీక్షలు..జీవితంలో ఒక భాగం మాత్రమే

అవే జీవితం కాదు…వాటిని పండగలా చూడాలి
అనవసర గందరగోళం తగదు
అవి మనమెక్కే మెట్లు మాత్రమే
‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో ప్రధాని మోడీ
విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేసిన ప్రధాని

న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 1 : ‌పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని.. అవే జీవితం కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పరీక్షలను పండగలా చూడాలని అన్నారు. పరీక్షలపై విద్యార్థులకు ఉన్న అనుమానాలను తొలగించడానికి శుక్రవారం ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమాన్ని మోడీ నిర్వహించారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఇది తనకు చాలా నచ్చిన
కార్యక్రమమని, కానీ కొరోనా వల్ల విద్యార్థులను కలవలేకపోయానన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ స్టూడెంట్స్‌ను కలుసుకోవడం హ్యాపీగా ఉందన్నారు. పరీక్షలంటే విద్యార్థులకంటే వారి పేరెంట్స్‌కు ఎక్కువ టెన్షన్‌ ఉం‌టుందన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు మోడీ సమాధానాలు ఇచ్చారు. పరీక్షలనేవి జీవితంలో సహజ భాగమని.. ఎదుగుదల క్రమంలో ఎక్కాల్సిన మెట్లుగా భావించాలన్నారు. అనవసరంగా భయాందోళనకు గురికావొద్దని సలహా ఇచ్చారు. దిల్లీలోని తాల్కతోరా స్టేడియంలో నిర్వహించిన ఐదో విడత పరీక్షా పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులతో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు.

కొరోనా కారణంగా సుదీర్ఘకాలం తర్వాత నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చ-2022 కార్యక్రమంలో విద్యార్థులను కలుసుకోవటం తనకు ఎంతో ప్రత్యేకమన్నారు. అంతకుముందు విద్యార్థులు రూపొందించిన కళాకండాల ప్రదర్శనను ఆయన తిలకించారు. ‘సమయాభావం వల్ల విద్యార్థుల ప్రశ్నలన్నింటికి ఈ వేదికపై సమాధానం ఇవ్వలేం. వీడియో, ఆడియో, సందేశాలు, టెక్టస్  ‌రూపంలో నమో యాప్‌ ‌ద్వారా అందిస్తాను. ఇక్కడ కూర్చున్న వారిలో తొలిసారి పరీక్షలకు హాజరవుతున్నవారెవరూ లేరు. పలుమార్లు పరీక్షలకు హాజరైనందున వాటి గురించి పూర్తి అవగాహన ఉంటుంది. మన జీవితంలో పరీక్షలు ఒక మెట్టు. పరీక్షల సమయంలో ఆందోళనకు గురికాకుండా ఉండాలి. స్నేహితులను అనుకరించకూడదు. నీకు వొచ్చింది ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయాలి. రంతా పరీక్షలను ఒక పండగలా జరుపుకోవాలి. ఆఫ్‌లైన్‌లో ఎలా జరిగిందో.. ఆన్లైలైన్‌లోనూ అదే జరుగుతుంది’ అని మోడీ ఈ సందర్భంగా అన్నారు.  ఇక్కడ డియం ముఖ్యం కాదు. మాధ్యమంతో సంబంధం లేకుండా, విషయాన్ని లోతుగా పరిశోధిస్తే, అర్థం చేసుకోవటంలో తేడా ఉండదని నరేంద్ర మోదీ అన్నారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో చదువుకుంటున్నప్పుడు తాము సమయాన్ని చదువుకోసం కేటాయిస్తున్నామా, సామాజిక మాధ్యమాల్లో గడుపుతున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలని మోడీ సూచించారు. విద్య జ్ఞానాన్ని పొందే సూత్రంపై ఆధారపడి ఉంటుందని, జాతీయ విద్యా విధానం ముసాయిదాను సిద్ధం చేసేందుకు చాలా మంది అందులో పాలుపంచుకున్నారని తెలిపారు. సుమారు 6-7 ఏళ్ల పాటు శోధించి రూపొందించామన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు నిపుణుల సూచనలు తీసుకున్నామని చెప్పారు. ఆన్‌ ‌లైన్‌ ‌క్లాసుల గురించి కూడా మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆన్‌ ‌లైన్‌ ‌రీడింగ్‌ ‌చేసేటప్పుడు చదువుతున్నారా లేదా రీల్స్ ‌చూస్తున్నారనేది తమను తాము ప్రశ్నించుకోవాలని చమత్కరించారు. ‘ఆన్‌ ‌లైన్‌, ఆఫ్‌ ‌లైన్‌ అనేది సమస్య కాదు. మాధ్యమం సమస్యే కాదు.. అసలు సమస్య మనసుతోనే. తరాన్ని బట్టి సాంకేతికంగా మార్పులు వొస్తూ ఉంటాయి. ఇప్పుడీ డిజిటల్‌ ‌యుగంలో నేర్చుకోవడం చాలా సులువుగా మారింది. ఆన్‌ ‌లైన్‌ ఎం‌తో అవసరం. దీని నుంచి ఎంతో జ్ఞానాన్ని సముపార్జించొచ్చు. ఇలా నేర్చుకున్న జ్ఞానాన్ని దైనందిన జీవితంలో వినియోగించాలి’ అని మోడీ పేర్కొన్నారు. ఇక ఉప్పల్‌ ‌లోని కేంద్రీయ విద్యాలయం1లో ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమాన్ని వర్చువల్‌గా నిర్వహించారు. ఇందులో సుమారు 3 వేల మంది స్టూడెంట్స్ ‌పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *