నేడు మోగనున్న ఎన్నికల నగారా

షెడ్యూల్‌ విడుదల చేసేందుకు రంగం సిద్ధం
 మధ్యాహ్నం విూడియా సమావేశంలో ప్రకటన
 షెడ్యూల్‌ వివరాలను వెల్లడిరచనున్న ఎన్నికల కమిషనర్లు

న్యూదిల్లీ, మార్చి 15 : సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు రంగం సిద్ధం అయ్యింది. పార్లమెంటుతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల కమిషన్‌ సర్వం సిద్ధం చేసుకుంది. ఈ మేరకు నేడు శనివారం ఎన్నికల నగారా మోగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం విూడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్‌ను ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ నేడు సోషల్‌ విూడియా వేదికగా అధికారికంగా వెల్లడిరచింది. లోక్‌సభతో పాటుగానే.. ఆంధ్రప్రదేశ్‌ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్‌ తేదీలను ప్రకటించనున్నారు. ప్రస్తుత లోక్‌సభకు జూన్‌ 16వ తేదీతో గడువు ముగియ నుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇటీవల దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఈసీ..స్థానిక రాజకీయ పార్టీలు, క్షేత్రస్థాయిలో అధికారులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది.

అనంతరం షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. గత లోక్‌సభ ఎన్నికలకు 2019 మార్చి 10న షెడ్యూల్‌ను ప్రకటించారు. ఏప్రిల్‌ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో పోలింగ్‌ జరిగింది. మే 23న వోట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్‌`మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. షెడ్యూల్‌ ప్రకటించగానే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది. ఇక వీటితో పాటు జమ్మూ కశ్మీర్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూ సిద్ధం చేస్తుంది.  ఎన్నికలు ఏప్రిల్‌, మే నెలలో జరగనున్నాయని ప్రచారం జరుగుతుంది. గతంలో 2019 ఎన్నికలు ఏప్రిల్‌, మే నెలలో నిర్వహించారు అధికారులు. ఇప్పుడు కూడా మునపటి విధానాన్నే ఫాలో అవుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page