హాజరు కానున్న ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు
హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 29 : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోషియా వుడ్ 2024 సమ్మిట్ నిర్వహించనున్నట్లు ఎండ్ నౌ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ రాచమల్లు తెలిపారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో డాక్టర్ విజయ్ భాస్కర్‌తో కలసి కార్యక్రమ బ్రోచర్ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఈ సమ్మిట్ యొక్క ఈ రెండవ ఎడిషన్‌లో 350 మంది టాప్-క్లాస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, విశిష్ట అతిథులు ఉంటారని తెలిపారు.
ఈ ఈవెంట్‌గా డిజిటల్ కమ్యూనిటీలో ఒక మైలురాయిగా మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం నేడు టీ హబ్, మార్వెల్, 5వ అంతస్తులో ఉ.9 నుండి సా. 6 వరకు జరగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ రావు, ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్, ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఏడీజీపీ శిఖా గోయల్, డీఐజీ ప్రకాష్ రెడ్డి, ఫేమస్ యాంకర్ సుమ కనకల, యాక్టర్ విరాజ్ అశ్విన్ హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు శివ, లిఖిత్ గౌడ్, భార్గవ్, గాయత్రి పాల్గొన్నారు.